Hyderabad Road Accident: ఇద్దరు విద్యార్థులను మింగేసిన బోర్‌వెల్ లారీ.. మరొకరి పరిస్థితి విషమం..!
హైదరాబాద్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరొకరి పరిస్థితి విషయంగా ఉంది.
Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరొకరి పరిస్థితి విషయంగా ఉంది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలోని సాగర్ కాంప్లెక్స్ రోడ్‌లో బైక్‌ను వెనుక నుంచి వచ్చిన బోర్‌వెల్ లారీ ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ విద్యార్థులు అదుపుతప్పి లారీ చక్రాల కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు రోహిత్‌రెడ్డి, విశాల్‌గా గుర్తించారు. గాయపడ్డ మరో విద్యార్థిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
Read Also… పారామిలటరీ దళాల ఎక్స్‌గ్రేషియా పెంపు.. అమరవీరుల కుటుంబాలకు రూ.35 లక్షలు.. ఇంకా ఈ ప్రయోజనాలు..