మోదీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే..!

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా జీ-7 సదస్సుకు రావాల్సిందిగా మోదీకి ట్రంప్ ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ”నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఈ సందర్భంగా జీ 7 సదస్సు, కరోనా విపత్కర పరిస్థితులతో పాటు పలు విషయాలపై ఇద్దరం చర్చించుకున్నాం. కరోనా తరువాత ప్రపంచ నిర్మాణంలో భారత్- అమెరికా మధ్య సంబంధాలు కీలక పాత్రను పోషించబోతున్నాయి” అని […]

మోదీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే..!
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 10:31 PM

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా జీ-7 సదస్సుకు రావాల్సిందిగా మోదీకి ట్రంప్ ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ”నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఈ సందర్భంగా జీ 7 సదస్సు, కరోనా విపత్కర పరిస్థితులతో పాటు పలు విషయాలపై ఇద్దరం చర్చించుకున్నాం. కరోనా తరువాత ప్రపంచ నిర్మాణంలో భారత్- అమెరికా మధ్య సంబంధాలు కీలక పాత్రను పోషించబోతున్నాయి” అని మోదీ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్‌, మోదీకి ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాని కార్యాలయం కూడా ధ్రువీకరించింది.

అమెరికాలో జరిగే తదుపరి జీ 7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా  మోదీని, ట్రంప్ కోరినట్లు తెలిపింది. అలాగే ఇరు దేశాల్లో కరోనా పరిస్థితి, అమెరికాలో జరుగుతున్న అల్లర్లు, జీ-7 కూటమి, భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులతో పాటు పలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నట్లు వెల్లడించింది. కాగా జీ-7 కూటమిని విస్తరించాలనుకుంటున్న ట్రంప్.. అందులో భారత్‌ సహా మరో మూడు దేశాలను చేర్చాలనుకుంటున్న విషయం తెలిసిందే. సాధారణంగా జీ 7 సమావేశాలు జూన్‌లో జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో సెప్టెంబర్‌కి వాయిదా పడ్డాయి.

Read This Story Also: రెచ్చిపోయిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్‌ని ట్యాగ్ చేస్తూ పవన్ హీరోయిన్ ఘాటు ట్వీట్లు..!