షాకింగ్.. మరో బీజేపీ నేతకు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇది ఎవర్నీ కూడా వదలడం లేదు. ముఖ్యంగా మొన్నటి వరకు ఎక్కువగా సామాన్యులనే తాకిన ఈ వైరస్ ఇప్పుడు రాజకీయ నాయకులను వదలడం లేదు

షాకింగ్.. మరో బీజేపీ నేతకు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇది ఎవర్నీ కూడా వదలడం లేదు. చిన్న,పెద్ద, పేద, ధనిక అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఎటాక్‌ చేస్తోంది. ముఖ్యంగా మొన్నటి వరకు ఎక్కువగా సామాన్యులనే తాకిన ఈ వైరస్ ఇప్పుడు రాజకీయ నాయకులను వదలడం లేదు. తాజాగా గుజరాత్‌ రాష్ట్రంలోని ఓ బీజేపీ ఎమ్మెల్యేకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. నరోడా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న బలరాం తవానీకి కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం నాడు పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. ఈ విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్య వెల్లడించారు. ఇప్పటికే జమాల్పూర్ ఖడియా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ కేడ్వాలా, నికోల్ బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ పంచల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదిహేడు వేలకు చేరింది. వీరిలో పది వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.