One Rupee Clinic In Odisha: మనసున్న దంపతులు.. పేద ప్రజల కోసం రూపాయికే వైద్యం.. ఈ డాక్టర్లకు సలాం
వైద్యో నారాయణ హరిః అన్నారు పెద్దలు. అవును డాక్టర్లను దేవుడితో సమానం అంటూ వారికి సమాజంలో ఓ అత్యున్నతస్థానాన్ని ఇచ్చారు. అయితే మారుతున్న కాలంతో పాటు వైద్య విధానం కూడా మారింది. దేశంలో సామాన్య,..
One Rupee Clinic In Odisha: వైద్యో నారాయణ హరిః అన్నారు పెద్దలు. అవును డాక్టర్లను దేవుడితో సమానం అంటూ వారికి సమాజంలో ఓ అత్యున్నతస్థానాన్ని ఇచ్చారు. అయితే మారుతున్న కాలంతో పాటు వైద్య విధానం కూడా మారింది. దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కార్పొటేట్ ఆస్పత్రి వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక సాధారణ జ్వరం, వంటి చిన్న చిన్న వ్యాధుల నిరారణ కోసం డాక్టర్లను ఆశ్రయించాలన్నా రూ. 200 నుంచి రూ. 500 వరకూ ఓపీ పీజు చెల్లించాల్సిందే.. అయితే ఇప్పుడు ఓ డాక్టర్ తాను చదువుకుంది పేదలకు వైద్య సేవలను అందించడానికి అంటూ.. కేవలం తన క్లినిక్ లో ఒక్క రూపాయి ఫీజునే తీసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయితో కనీసం టీ కూడా తాగలేం.. అటువంటిది ఒడిశాకు చెందిన ఓ ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కేవలం రూపాయి ఫీజుగా తీసుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
సంబల్ పూర్ జిల్లాలోని శంకర్ రామచందాని అనే వ్యక్తి సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శంకర్ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో బూర్లా అనే గ్రామంలో క్లినిక్ ను ప్రారంభించారు. ఆ క్లినిక్ లో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు పేదలకు వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాదు నాణ్యమైన వైద్యంపొందలేని వారికి, దివ్యాంగులు, వృద్ధులకు మెరుగైన చికిత్సను ఈ క్లినిక్ ద్వారా ఇస్తున్నారు శంకర్ రామచందాని. డాక్టర్ భార్య సిఖా డెంటల్ సర్జన్ కాగా ఆమె కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ పేదలకు రూపాయికే వైద్య సేవలను అందిస్తూ.. భర్తకు తగ్గ భార్య అనిపించుకున్నారు.
రూపాయి ఫీజు ఎందుకు ఉచితంగా వైద్య సేవలను ఇవ్వచ్చు కదాఅని ఎవరైనా అడిగితె.. తాము ఫ్రీగా సేవ చేసుకుంటున్నామని భావన ఉండకూడదనే ఉదేశంతోనే రూపాయి ఫీజు తీసుకుంటున్నామని ఈ దంపతులు తెలిపారు. అంతేకాదు కరోనా సమయంలో కూడా డాక్టర్ శంకర్ ఈ ఆస్పత్రిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి.. మెరుగైన వైద్యం అందించారు.. అందరితోనూ ప్రశంసలను అందుకుంటున్నారు.
Also Read: