Tripura CM: సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం.. బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రణాళిక వెల్లడి..!
BJP in Sri Lanka and Nepal: బీజేపీ నేత, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ కేవలం..
BJP in Sri Lanka and Nepal: బీజేపీ నేత, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ కేవలం దేశానికే పరిమితం కాకుండా పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌లలోనూ విస్తరించాలని యోచిస్తోందన్నారు. అగర్తలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన విప్లవ్ దేవ్.. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో గెలిచిన తరువాత.. విదేశాల్లోనూ బీజేపీని విస్తరింప చేస్తామని అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నట్లు చెప్పారు. గతంలో రాష్ట్ర గెస్ట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తాము పాల్గొనగా.. అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. ‘నేపాల్, శ్రీలంక దేశాల్లో బీజేపీని విస్తరింప జేయాలి.
అక్కడ పార్టీని ఏర్పాటు చేయాలంటే.. ముందుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి’ అని అమిత్ చెప్పారని నాటి సంభాషణను విప్లవ్ దేవ్ ఉటంకించారు. ఇదే సమయంలో, త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. కేరళలో ప్రతి ఐదేళ్లకోసారి వామపక్ష ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడుతాయని, ఈసారి ఆ విధానానికి బీజేపీ చెక్ పెడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రంలో కూడా విజేతగా బీజేపీ అవతరిస్తుందని పేర్కొన్నారు.
Also read
India vs England 2nd Test: నిలకడగా ఆడుతోన్న కోహ్లీ, అశ్విన్.. లంచ్ విరామ సమయానికి..
One Rupee Clinic In Odisha: మనసున్న దంపతులు.. పేద ప్రజల కోసం రూపాయికే వైద్యం.. ఈ డాక్టర్లకు సలాం