AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతం అడిగి చంపేంత టైమ్‌ ఉగ్రవాదులకు ఉంటుందా? కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వడెట్టివార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉగ్రవాదులు మతం అడిగి చంపారా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ప్రభుత్వ వైఫల్యాన్ని వడెట్టివార్ తీవ్రంగా ఖండించారు. కాగా ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

మతం అడిగి చంపేంత టైమ్‌ ఉగ్రవాదులకు ఉంటుందా? కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Congress Mla Vijay Wadettiw
SN Pasha
|

Updated on: Apr 28, 2025 | 1:16 PM

Share

పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిని యావత్‌ దేశం, ప్రపంచం కూడా తీవ్రంగా ఖండించింది. అయితే.. తాజాగా ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఈ ఉగ్రదాడి గురించి స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది? అసలు ఉగ్రవాదులకు మతం అడిగి మరీ చంపేంత టైమ్‌ తీసుకుంటారా? అంటూ ప్రశ్నించారు. కానీ, ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు, అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఉగ్రవాదులు తమ మతం ఏంటని అడిగి మరీ కాల్చారంటూ చెబుతున్నారు. కానీ, మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విజయ్‌ వడెట్టివార్‌ మాత్రం పై విధంగా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. “ఉగ్రవాదులు ప్రజలను (వారి మతం గురించి) అడిగిన తర్వాత చంపేశారని వారు (ప్రభుత్వం) చెబుతున్నారు. నిజంగా వాళ్లు అంత సమయం తీసుకుంటారా? ఉగ్రవాదులకు కులం లేదా మతం లేదు. బాధ్యులను పట్టుకుని చర్యలు తీసుకోండి. ఇది దేశ భావన” అని వడెట్టివర్ అన్నారు. కశ్మీర్‌లో 26 మంది పౌరుల హత్య ప్రభుత్వ వైఫల్యమని వడెట్టివార్ నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు. “ప్రభుత్వ భద్రత ఎక్కడ ఉంది, పర్యాటక ప్రదేశాలలో భద్రతను ఎందుకు మోహరించలేదు?” అని ఆయన ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది, వాటిలో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం కూడా ఉంది.

పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. నీటి కొరత దానిని తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే, అట్టారి సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్‌ను భారత ప్రభుత్వం మూసివేసింది. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ అన్ని వాణిజ్య కార్యకలాపాలతో పాటు సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాగే పాక్‌ తమ గగనతలంలోకి భారత విమానాలను నిషేధించింది. అలాగే, సింధు నది జలాలను ఆపినా, మళ్లించడానికి ప్రయత్నించినా దాన్ని “యుద్ధ చర్య”గా పరిగణిస్తామని ఇండియాని హెచ్చరించింది. ప్రస్తుతం అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్‌ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి