ఖుర్బానీ ఫోటోలు తీయొద్దు.. లక్నో ఇమామ్ విఙ్ఞప్తి
స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెల్ఫీలు దిగడం, వీడియో చిత్రీకరించడం సర్వసాధరణంగా మారింది. వీటిని సోషల్ మీడియాలో క్షణాల్లో పోస్టు చేస్తున్నారు. అయితే ఈనెల 12న జరగనున్న ఈదుల్ అజా ( బక్రీద్) సందర్భంగా పవిత్ర బలి ఖుర్భానీ ఇస్తున్నప్పుడు ఫోటోలు తీయొద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దంటున్నారు ముస్లీం మత పెద్దలు. బక్రీద్ నేపథ్యంలో జంతువులను బలి ఇచ్చే సమయంలో ఎవ్వరూ ఫోటోలు తీసి వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వాటిలో పోస్టు చేయొద్దని […]
స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెల్ఫీలు దిగడం, వీడియో చిత్రీకరించడం సర్వసాధరణంగా మారింది. వీటిని సోషల్ మీడియాలో క్షణాల్లో పోస్టు చేస్తున్నారు. అయితే ఈనెల 12న జరగనున్న ఈదుల్ అజా ( బక్రీద్) సందర్భంగా పవిత్ర బలి ఖుర్భానీ ఇస్తున్నప్పుడు ఫోటోలు తీయొద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దంటున్నారు ముస్లీం మత పెద్దలు.
బక్రీద్ నేపథ్యంలో జంతువులను బలి ఇచ్చే సమయంలో ఎవ్వరూ ఫోటోలు తీసి వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వాటిలో పోస్టు చేయొద్దని లక్నోకు చెందిన ముస్లిం ఇమామ్ ఆదేశించారు. ఐష్ బాగ్ ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ఫారంగీ .. ముస్లింలకు ఒక విఙ్ఞప్తి చేశారు. ఇతరులు పూజించే గోవులను వధించి వారి మనోభావాలను దెబ్బతీయడం ఇస్లాం అంగీకరించదని మౌలానా స్పష్టం చేశారు. అదే విధంగా రోడ్ల పక్కన జంతువులను బలి ఇవ్వొద్దని, వాటి రక్తం రోడ్లపై ప్రవహించకుండా శుభ్రత పాటించాలని ఆయన కోరారు.