శరద్ పవార్ కు ‘టాక్స్ నోటీసు’, పంపలేదన్న ఈసీ

ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ పన్నుల చెల్లింపు విషయంలో ఆరా తీయాల్సిందిగా ఆయనకు నోటీసు జారీ చేయాలని తాము కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును గానీ, ఏ టాక్స్ అధికారిని గానీ ఆదేశించలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది.

శరద్ పవార్ కు 'టాక్స్ నోటీసు', పంపలేదన్న ఈసీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2020 | 2:04 PM

ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ పన్నుల చెల్లింపు విషయంలో ఆరా తీయాల్సిందిగా ఆయనకు నోటీసు జారీ చేయాలని తాము కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును గానీ, ఏ టాక్స్ అధికారిని గానీ ఆదేశించలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. తన ఎన్నికల అఫిడవిట్లకు సంబంధించి కొన్ని వివరణలు కావాలంటూ ఆదాయపు పన్ను శాఖ నుంచి తనకు నోటీసు అందిందని శరద్ పవార్ చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను దాదాపు వేధించడానికి కేంద్రం ఇలా నోటీసులను పంపేట్టు చూస్తోందని ఆయన ఆరోపించారు.ఏమైనా ఈ నోటీసుకు సమాధానం ఇస్తానన్నారు. ఇదే కాదు, ఈ ఏడాదే కాకుండా 2014, 2009-10 లో కూడా నేను దాఖలు చేసిన అఫిడవిట్లకు సంబంధించి నోటీసులు తనకు అందాయన్నారు. సుప్రియా సూలెకు కూడా ఈ విధమైన నోటీసు అందిందని ఆయన చెప్పారు. అయితే  మీకు మాత్రం నోటీసు పంపాలంటూ టాక్స్ అధికారులను ఆదేశించలేదని ఈసీ వివరణ ఇచ్చింది.