AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వ్యాక్సిన్ సమర్ధతపై ఐసిఎంఆర్ డీజీ ఆసక్తికర వ్యాఖ్యలు

మాయాదారి రోగానికి విరుగుడుగా టీకా ఎప్పుడు వస్తుందా అని ప్రపంచం మొత్తంగా ఆశగా ఎదురుచూస్తుంది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సమర్ధతపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాక్సిన్ సమర్ధతపై ఐసిఎంఆర్ డీజీ ఆసక్తికర వ్యాఖ్యలు
Balaraju Goud
|

Updated on: Sep 23, 2020 | 2:08 PM

Share

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశంలోనూ వైరస్ అంతకంతకు విజృంభిస్తుంది. మందు లేని మాయాదారి రోగానికి విరుగుడుగా టీకా ఎప్పుడు వస్తుందా అని ప్రపంచం మొత్తంగా ఆశగా ఎదురుచూస్తుంది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సమర్ధతపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం సమర్ధవంతంగా పనిచేయదని అన్నారు. అయితే, 50-100 శాతం ఉంటే దానిని వినియోగించడానికి అనుమతించవచ్చని పేర్కొన్నారు. ‘శ్వాసకోస వ్యాధులకు వినియోగించే ఏ టీకాలూ 100 శాతం సమర్ధతను చూపవని.. భద్రత, వ్యాధినిరోధకత, సమర్ధత ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.. 50 శాతం సమర్థత చూపిన టీకాను అమోదించాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీంతో తాము 100 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని.. కానీ, టీకా సామర్థ్యం 50-100 శాతం మధ్య ఉంటుందని బలరామ్ భార్గవ అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఫలితాలు కొంత సంతృప్తికరంగా ఉన్నాయి. ఈ టీకా సురక్షితమని, టీకా తీసుకున్న వ్యక్తుల్లో వ్యాధి నిరోధకత పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. రెగ్యులేటరీ అధికారులు సైతం వ్యాక్సిన్ భద్రత, సమర్ధతను నిర్ధారించారు. టీకా 100 శాతం సమర్ధతపై కాకుండా ఒక వ్యక్తిని రక్షించే అంశానికి పరిశోధకులు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కొవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసిన మర్నాడే బలరామ్ భార్గవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, ముంబైకి చెందిన నలుగురు ఆరోగ్య కార్యకర్తలకు కొవిడ్ -19 రెండోసారి సోకినట్టు జన్యుశ్రేణిని ఉపయోగించి నిర్ధారించారు. ది లాన్సెట్ మెడికల్ జర్నల్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఫలితాలు ప్రకారం.. ఈ నలుగురికీ ముందుతో పోలిస్తే వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని వెల్లడైంది. నాయర్ హాస్పిటల్‌లో ముగ్గురు వైద్యులు, హిందూజా హాస్పిటల్‌లో ఓ ఆరోగ్య సిబ్బందికి రెండోసారి వైరస్ సోకినట్లు తెలిందని జర్నల్ వెబ్‌సైట్‌లో ప్రచురించారు.

కాగా, వ్యాక్సిన్ అభివృద్ధిపై సీడీఎస్ఓ ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. కొవిడ్ -19 వ్యాక్సిన్లను ఆమోదించాలని యోచిస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన కనీసం 50 శాతం మందికి వ్యాధినిరోధకశక్తి అధికంగా చూపుతుంది. ఇప్పటి వరకు వివిధ సంస్థల టీకాలు ప్రయోగాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు దశవ్లో వ్యాక్సిన్ ను ప్రయోగాన్ని విస్తృతంగా పరీక్షించిన తర్వాత కొవిడ్ -19 వ్యాక్సిన్ సమర్ధంగా పనిచేస్తోందని, ప్లేసిబో-నియంత్రిత సమర్థత కనీసం 50% ఉండాలని సీడీఎస్ఓ మార్గదర్శకాలలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా, భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వ్యాక్సిన్‌లు మానవ క్లినికల్ దశలో ఉన్నాయి. రష్యా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు కూడా త్వరలో అనుమతి లభించనుంది. సమర్థవంత పరిశోధనల అనంతరం టీకాను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.