Dengue Danger Bells: విరుచుకుపడుతున్న డెంగ్యూ.. దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న బాధితులు..
Dengue vs Corona: దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి పీడ కొనసాగుతుండగానే, మరోవైపు డెంగ్యూ సైతం విరుచుకుపడుతోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ మహమ్మారి ప్రభావం దేశ వ్యాప్తంగా
Dengue vs Corona: దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి పీడ కొనసాగుతుండగానే, మరోవైపు డెంగ్యూ సైతం విరుచుకుపడుతోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ మహమ్మారి ప్రభావం దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అత్యున్నతస్థాయి బృందాలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, కేసుల తీవ్రత అధికంగా ఈ 9 రాష్ట్రాలకు పంపించింది. నవంబర్ 1న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హైలెవెల్ బృందాలను రాష్ట్రాలకు పంపినట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలియజేసింది. కేసుల తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో హరియాణా, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్ము-కాశ్మీర్ ఉన్నాయి.
డెంగ్యూ కేసుల తీవ్రత పెరిగిన రాష్ట్రాలకు అవసరమైన సహాయసహకారాలు అందించాల్సిందిగా ఆరోగ్యశాఖ అధికారులకు సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,16,991 డెంగ్యూ కేసులను గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. సహజంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఎక్కువగా కనిపించే డెంగ్యూ కేసులు గత ఏడాదితో పోల్చినప్పుడు 15 రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎక్కువ కేసులు నమోదయ్యాయని కేంద్రం గుర్తించింది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 86 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపింది.
ఈ పరిస్థితుల్లో గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలతో పోల్చినప్పుడు ఈ ఏడాది కేసుల సంఖ్య ఎక్కువ నమోదు చేసిన 9 రాష్ట్రాలకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్వీబీడీసీపీ) సంస్థల నుంచి నిపుణులతో అత్యున్నతస్థాయి బృందాలను ఏర్పాటు చేసి, రాష్ట్రాలకు పంపించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డెంగ్యూ నివారణలో రాష్ట్రాలకు సహకరించడం, తగిన సూచనలు చేయడం ఈ బృందం ప్రధాన లక్ష్యమని తెలిపింది. అలాగే ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రతపై స్టేటస్ రిపోర్ట్ రూపొందించడం, వ్యాధి చికిత్సకు అవసరమైన ఔషధాలు, కిట్స్ లభ్యత, త్వరగా వ్యాధి నిర్థారణ, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణకు అవసరమైన క్రిమిసంహారకాలు తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర బృందం పరిశీలనలో బయటపడ్డ లోపాలను రాష్ట్రాలతో చర్చించి, వాటిని సరిదిద్దే క్రమంలో తగిన సహాయం అందించడం ఇందులో భాగమని కేంద్రం తెలిపింది.
Also read:
PM Kisan: పీఎం కిసాన్ పథకంలో భార్యాభర్తలిద్దరికి డబ్బులు వస్తాయా..! అసలు నిజాలు తెలుసుకోండి..
Ram Charan & Shankar: ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్.. RC15 సినిమా అప్డేట్..
Andhra Pradesh: ఆ భూములను లాక్కుంటాం.. ఏపీ మంత్రి వెల్లంపల్లి సంచలన కామెంట్స్..