AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: సినీ నిర్మాతలకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు

Indian Railways: సినిమా నిర్మాతలు, ప్రొడక్షన్ సంస్థలకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. రైల్వే శాఖ ఆధీనంలోని రైళ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లపై సినిమా షూటింగ్‌‌లకు అనుమతులను రైల్వే శాఖ..

Indian Railways: సినీ నిర్మాతలకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు
Indian Railways
Janardhan Veluru
|

Updated on: Nov 03, 2021 | 5:20 PM

Share

Indian Railways News: సినిమా నిర్మాతలు, ప్రొడక్షన్ సంస్థలకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. రైల్వే శాఖ ఆధీనంలోని రైళ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లపై సినిమా షూటింగ్‌‌లకు అనుమతులను రైల్వే శాఖ మరింత శులభతరం చేసింది. అనుమతుల జారీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక సింగిల్ విండే ఆన్‌లైన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

భారత సినిమాలతో రైల్వే శాఖకు ప్రత్యేక అనుబంధం ఉందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ అన్నారు. రైల్వే ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లకు తాము ఎప్పుడూ అనుమతులు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇకపై రైల్వే ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో రైల్వే ప్రాంగణాల్లో మరిన్ని ఎక్కువ సినిమాలు చిత్రీకరణ జరిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తంచేశారు.

గతంలో సినిమాల షూటింగ్‌ల కోసం రైల్వేస్ అనుమతి మంజూరు ప్రక్రియ ఆఫ్ లైన్‌లో జరిగేది. సినిమా షూటింగ్‌లకు పర్మీషన్ కోసం 17 జోనల్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, రైల్వే బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్‌కు వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

సినిమాలతో పాటు టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, మ్యూజిక్ వీడియో, కమర్షియల్ యాడ్స్‌‌కు సంబంధించిన షూటింగ్‌లకు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read..

Huzurabad Elections – Trs: హుజూరాబాద్‌ ఓటమిపై గులాబీ బాస్ గుస్సా!.. ఆందోళనలో ఇన్‌చార్జిలు..

Andhra Pradesh: నవంబర్ 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కార్..