ఉద్యమానికి బాసటగా సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్.. రైతులందరికీ మూడు పూటలా ఆహారం అందజేత..!

ఎన్డీయే సర్కార్ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.

ఉద్యమానికి బాసటగా సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్.. రైతులందరికీ మూడు పూటలా ఆహారం అందజేత..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 05, 2020 | 2:28 PM

ఎన్డీయే సర్కార్ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. గత వారం రోజులుగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, రైతుల ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు రైతులకు సంఘీభావం ప్రకటించగా, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సైతం వారికి అండగా నిలుస్తున్నారు. తమకు లభించిన అవార్డులు, పథకాలను తిరిగి ఇచ్చేస్తున్నారు. తాజాగా రైతులకు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అండగా నిలిచింది. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు భోజనం అందజేసింది. రోజుకు మూడు సార్లు రైతులకు భోజనం అందజేస్తున్నామని ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీకి చెందిన వాలంటీర్ తెలిపాడు. అంతకుముందు ఘజియాబాద్ గురుద్వారకు చెందిన వాలంటీర్లు రైతులకు తేనీరు అందజేసేవారు. ఇప్పుడు మూడు పూటలా భోజనం పెట్టేందుకు ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీ సిద్ధమవడం విశేషం.