కొల్‌కత్తాలో ‘నో హెల్మెట్ నో పెట్రోల్’ విధానం… డిసెంబర్ 8 నుంచి అమలు… ఉత్తర్వులు జారీ చేసిన కొల్‌కత్తా పోలీసు కమిషనర్
కొల్‌కత్తాలో నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజూ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 2, 2021 వరకు ఈ విధానం అమలులో ఉండనుంది.
No helmet, no fuel కొల్‌కత్తాలో నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజూ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 2, 2021 వరకు ఈ విధానం అమలులో ఉండనుంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, హెల్మెట్ తో వస్తేనే పెట్రోల్ పోస్తారని కొల్‌కత్తా అధికారులు తెలిపారు.
హెల్మెట్ ఉచితంగా అందిస్తాం….
పశ్చిమ బెంగాల్ లోని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కొనలేని స్థితిలో ఉంటే దగ్గరిలోని పోలీస్ స్టేషన్లో వివరాలు ఇస్తే ప్రభుత్వమే హెల్మెట్ ఫ్రీగా ఇస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇతర ప్రభుత్వాల్లాగా వాహనదారులపై ఫైన్లు వేయకుండా… మేమే ఫ్రీగా హెల్మెట్లు అందిస్తామని ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ముఖ్యమంత్రి కోరారు. మాస్కులు కూడా తప్పనిసరిగా వాడాలని, ఒకవేళ బైక్ వెనకాల మరో ప్రయాణికుడు ఉంటే వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి అని సూచించారు. హెల్మెట్ ఉంటేనే బంకుల్లో పెట్రోల్ పోస్తారని తెలిపారు.