మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది మార్చి 31వ వరకు పాఠశాలలు మూసివేత..!

కరోనా మహమ్మారి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని పాఠశాలలు వచ్చే ఏడాది మార్చి 31వ వరకు మూసివేస్తున్నట్లు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు.

మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది మార్చి 31వ వరకు పాఠశాలలు మూసివేత..!
Follow us

|

Updated on: Dec 05, 2020 | 2:05 PM

కరోనా మహమ్మారి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని పాఠశాలలు వచ్చే ఏడాది మార్చి 31వ వరకు మూసివేస్తున్నట్లు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. 10-12 తరగతుల విద్యార్థులకు త్వరలోనే రెగ్యులర్‌ తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే విద్యా సంవత్సరం ఏప్రిల్‌ 1న మొదటవుతుందని వెల్లడించారు. అలాగే, ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకూడదని, ప్రాజెక్టుల ఆధారంగా మదింపు చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో 10-12 తరగతుల పరీక్షలు జరుగుతాయని, వారికి త్వరలోనే క్లాస్‌లు ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు. సమీప భవిష్యత్తులో సామాజిక దూరం, ఇతర జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 9-11 తరగతుల విద్యార్థులను వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే పాఠశాలల్లో క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ సమీక్ష సమావేశంలో తెలిపారు. రాబోయే మూడేళ్లలో పదివేల పాఠశాలలను ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం చౌహాన్‌ అధికారులను ఆదేశించారు.

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!