షాకింగ్ న్యూస్.. ‘కొవాగ్జిన్’ టీకా వేసుకున్న హర్యానా మంత్రి అనిల్ విజ్.. నెల రోజుల తిరగక ముందే కరోనా పాజిటివ్..
హర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వెళ్లిన ఆయన కరోనా టెస్ట్...
హర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వెళ్లిన ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఆయనకు కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కోవాగ్జిన్’ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా టీకా వేయించుకునేందుకు హర్యానాలో తొలి వలంటీర్‌గా మంత్రి అనిల్ విజ్ తన పేరును నమోదు చేసుకున్నారు. ఆ మేరకు టీకా కూడా వేయించుకున్నారు. అయితే, ఈ టీకా వేయించుకుని సరిగ్గా నెల రోజులు కూడా గడవలేదు. ఇంతలోనే మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. ‘కొవాగ్జిన్’ పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్ని రోజులుగా తనను కలవడానికి వచ్చిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మంత్రి అనిల్ విజ్ విజ్ఞప్తి చేశారు.