దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వాహనదారులు వరదనీటిలో పడరాని పాట్లు పడుతున్నారు. ఢిల్లీ లోని సఫ్ధర్‌జంగ్ ఆస్పత్రి ప్రాంతంలో రికార్డ స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. గత 19 ఏళ్లలో ఇదే గరిష్ట వర్షపాతం అని వాతావరణశాఖ(IMD) అధికారులు వెల్లడించారు. రహదారులపై వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీర్‌సింగ్ మార్గ్‌లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లు వరద కాలువలను తలపిస్తున్నాయి. ప్రముఖులు ప్రయాణించే 7 రేస్ కోర్స్ రోడ్డులో కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు జన్‌పథ్ మార్గ్‌లో భారీ చెట్టు నేలకొరిగింది. రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలడంతో ప్రక్కనే ఉన్న పలు ఇళ్ల ప్రహరీ గోడలు ద్వంసమయ్యాయి. పార్కింగ్ చేసిన పలు కార్లు కూడా దెబ్బతిన్నాయి.
ఇదిలావుంటే.. దౌవ్‌లాఖాన్ అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీవీఐపీలు తిరిగే 7 రేస్ కోర్స్ రహదారిపై భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది. రహదారి పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఏ గుంట ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. మోకాలు లోతు నీరు ఉండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
లోధి రోడ్డు, పాలెం , ఆయన్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో సబ్‌వేలు కూడా నీట మునిగాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రానున్న 24 గంటల్లో ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
There has been heavy rainfall in Delhi. It started y’day & we already have 2-3 spells. It was around 11.2 cm rain, particularly in Safdarjung & Lodhi road area. In 19 years, it is the highest rain in September: IMD Senior Scientist RK Jenamani pic.twitter.com/Fa7ziSRW8k
— ANI (@ANI) September 1, 2021
ఇవి కూడా చదవండి: Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..