Delhi Rains: దేశ రాజధానిని వణికిస్తున్న వర్షాలు.. ఎయిర్‌పోర్టులోకి చేరిన నీరు.. షాకింగ్ వీడియో..
Heavy rains lash Delhi:దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో

Heavy rains lash Delhi:దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతోపాటు పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా ఏయిర్ పోర్టులోకి వరద నీరు చేరింది. ప్రవేశ ద్వారం వద్ద నుంచి లోపల వరకు వరద నీరు చేరింది. ఈ మేరకు పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేశాయి. రాకపోకలు, విమానాలు బయలుదేరడంలో ఆలస్యమయ్యే సూచనలున్నాయని.. ప్రయాణికులు గమనించగలరని సూచించాయి.
Delhi: Waterlogging at Indira Gandhi International Airport (Terminal 3) after national capital received heavy rain
As per India Meteorological Department (IMD), Delhi will witness ‘generally cloudy sky, heavy rain/thundershowers, very heavy rain at isolated places towards night’ pic.twitter.com/q36727krfB
— ANI (@ANI) September 11, 2021
ఇదిలావుంటే.. భారత వాతావరణ శాఖ ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం రాత్రి నుంచి దేశ రాజధానిలోని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 94.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
#WATCH | Parts of Delhi Airport waterlogged following heavy rainfall in the national capital; visuals from Indira Gandhi International Airport (Terminal 3) pic.twitter.com/DIfUn8tMei
— ANI (@ANI) September 11, 2021
వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరద పోటెత్తింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఢిల్లీలో గత 19ఏళ్లల్లో సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుంచి ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 81 శాతం ఎక్కువ అని ఐఎండీ అధికారులు వివరించారు.
Also Read: