CBI – Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ స్పీడ్.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సమన్లు జారీ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఆప్ కీలక నేత, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఇప్పటీకే ఈ కేసుకు సంబంధించి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఆప్ కీలక నేత, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఇప్పటీకే ఈ కేసుకు సంబంధించి. మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు చేసిన సీబీఐ… మరోసారి సిసోడియాకు నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. కాగా, సీబీఐ నోటీసులపై ట్వి్ట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఇప్పటికే 14 గంటల పాటు తన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారని వెల్లడించారు. తన బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేశారని చెప్పారు. అయినా సీబీఐకి ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, మరోసారి సీబీఐ విచారణకు వెళ్తాన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన మనీష్ సిసోడియా.. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.
గతంలో ఈడీ..
లిక్కర్ స్కామ్‌పై సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఓవైపు, ఈడీ మరోవైపు విచారణ జరుపుతున్నాయి. ఈ కేసులో ఈడీ ఇప్పటికే మనీష్ సిసోడియాకు నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పాటు.. విచారణ కూడా జరిపింది. మనీష్ సిసోడియానే కాదు.. లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న పలువురిని సీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి. తెలంగాణకు చెందిన అభిషేక్ రావును సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఈక్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
రామచంద్ర పిళ్లైకు రెండోసారి..
లిక్కర్ స్కామ్ కేసులో రామచంద్ర పిళ్ళై కు రెండోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి అభిషేక్ అరెస్ట్ సమయంలోనే రామచంద్రపిళ్ళైకి సీబీఐ నోటీసులు ఇచ్చినా.. కూతురు అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. వారం రోజులు గడవడంతో రెండోసారి రామచంద్ర పిళ్ళై కు నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. A14 గా ఉన్న రామచంద్ర పిళ్ళై పేరు చేర్చింది. రాబిన్ డిస్టీలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కు ఎండీగా ఉన్న రామచంద్ర పిళ్ళైను నగదు లావాదేవీల్లో కీలకంగా గుర్తించిన సీబీఐ గుర్తించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..