Ramdev baba: మరోసారి చిక్కుల్లో యోగా గురువు బాబా రామ్‌దేవ్.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి షాక్ తగలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

Delhi High Court Notice to Baba Ramdev: యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి షాక్ తగలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కోవిడ్-19కు చికిత్సలో అల్లోపతి విధానాన్ని విమర్శించినందుకు ఆయనపై దాఖలైన పిటిషన్‌పై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అల్లోపతితోపాటు, అల్లోపతి వైద్యులపై తప్పుడు సమాచారం చేశారన్న ఆరోపణలతో.. ఆయనపై దేశవ్యాప్తంగా పలు చోట్ల అనేక కేసులు నమోదయ్యాయి. అటు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 10న జరుగుతుంది.
రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ హర్షవర్ధన్ జోక్యంతో బాబా రామ్‌దేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ వివిధ డాక్టర్స్ అసోసియేషన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయనకు పంపిన లీగల్ నోటీసులో తన వ్యాఖ్యలను 15 రోజుల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. రామ్‌దేవ్ బాబాపై పాట్నా, రాయ్‌పూర్‌లలో కూడా ఫిర్యాదులు దాఖలయ్యాయి.
Read Also…