AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: ప్రగతి భవన్‌ను పేదలకు పంచుతాం.. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

Bandi Sanjay: ప్రగతి భవన్‌ను పేదలకు పంచుతాం.. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay
Balaraju Goud
|

Updated on: Jul 30, 2021 | 3:19 PM

Share

Bandi Sanjay Comments on CM Camp Office: తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బండి సంజయ్ ఒక్క అడుగు ముందుకు వేసి.. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్.. ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. పైగా సాగు చేసుకుంటున్న గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు దళితులు, గిరిజనులపైన చిత్తశుద్ధి లేదు. మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఒక్కొక్క దళితుడికి రూ.10 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 శాతం దళితుల్లో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రిగా చేసే అర్హత లేదా?’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

బీజీపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని సంజయ్ తెలిపారు. తొలి సంతకం ఈ ఫైల్ పైనే చేస్తామన్నారు. ఓట్లు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఫేక్ ఐడీలు సృష్టించి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్, ఆత్మగౌరవ భవనాలు ఎక్కడికి పోయాయి.. రాష్ట్రంలో అన్ని కుల వృత్తులను కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు.

రాష్ట్రంలో దళిత హక్కు పరిరక్షణకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10వేల డప్పులతో ఉద్యమిస్తామన్నారు. 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను మోడీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2023లో తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. కేసీఆర్ లాఠీ, పోలీసు తూటాలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరన్న బండి.. అగ్రవర్ణ పేదల పక్షాన బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్‌ వెల్లడించారు.

Read Also… 

PV Sindhu: టోక్యో ఒలంపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్ర యాత్ర.. పతకానికి మరో అడుగు దూరంలో తెలుగుతేజం

Follow Us
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్