AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ప్రియులకు కిక్కెక్కే వార్త.. 25 శాతం తక్కువ రేటుకే..

మద్యం ప్రియులకు ఇది పక్కా కిక్కేక్కించే వార్తే. అది కూడా ఫారిన్ లిక్కర్ అంటే ఇష్టపడేవారికి మాత్రమే. అవును ఢిల్లీ సర్కార్ లిక్కర్ ప్రియులకు కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం తక్కువకే అందించేందుకు సిద్ధమైంది. అయితే ఇది అన్నింటికి కాదు. ఎవైతే.. ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో పట్టుబడే లిక్కర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేపట్టినప్పుడు దొరికే ఫారిన్ (విదేశీ) లిక్కర్‌‌ను.. వాటిపై ఉండే ధర కంటే.. 25 […]

మద్యం ప్రియులకు కిక్కెక్కే వార్త.. 25 శాతం తక్కువ రేటుకే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 09, 2019 | 2:23 PM

Share

మద్యం ప్రియులకు ఇది పక్కా కిక్కేక్కించే వార్తే. అది కూడా ఫారిన్ లిక్కర్ అంటే ఇష్టపడేవారికి మాత్రమే. అవును ఢిల్లీ సర్కార్ లిక్కర్ ప్రియులకు కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం తక్కువకే అందించేందుకు సిద్ధమైంది. అయితే ఇది అన్నింటికి కాదు. ఎవైతే.. ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో పట్టుబడే లిక్కర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేపట్టినప్పుడు దొరికే ఫారిన్ (విదేశీ) లిక్కర్‌‌ను.. వాటిపై ఉండే ధర కంటే.. 25 శాతం తక్కువకే అమ్ముతామని తెలిపింది. పట్టుబడ్డ విదేశీ బాటిళ్లపై ఆథరైజ్డ్ కాన్ఫిస్కేటెడ్ లిక్కర్ అని రాసి ఉంటుందని పేర్కొంది. ఇప్పటి వరకు తనిఖీల్లో సీజ్ అయిన మద్యాన్ని పారబోయడం లేదా ధ్వంసం చేయడం లాంటివి చేస్తుండేవారు. అయితే అలా చేసే బదులుగా.. వాటిని తక్కువ ధరకు అమ్మాలని కేజ్రీవాల్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అయితే ఎది పడితే ఆ బాటిళ్లను అమ్మడం కాదని.. తొలుత దొరికిన మద్యం బాటిళ్లను ల్యాబ్ టెస్టుకు పంపి.. అందులో ఉన్న మద్యం క్వాలిటీ చెక్ చేసి.. నాణ్యమైనదేనని తేలితేనే అమ్మనున్నట్లు వివరణ ఇచ్చింది.

అయితే ఇలా పట్టుబడ్డ లిక్కర్ అమ్మే నిర్ణయాన్ని అమలు చేసే తొలి నగరంగా ఢిల్లీ రికార్డులకెక్కనుంది. కాగా, అధికారిక సమాచారం ప్రకారం.. ఆబ్కారీ శాఖ ఏటా 2.5 లక్షల ఫారిన్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంటోంది. గడిచిన 2018-19లో రూ.15 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసింది.

Follow Us
చాణక్య నీతి సూచించిన విజయవంతమైన దాంపత్య రహస్యాలు!
చాణక్య నీతి సూచించిన విజయవంతమైన దాంపత్య రహస్యాలు!
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..
ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..
20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం
20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం
ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..
ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..
18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా
18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా
డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..
డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..
ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..
ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..