“మీతో కలిసి పనిచేస్తా”.. మోదీకి సప్రైజ్ ఇచ్చిన కేజ్రీ..!

ఢిల్లీలో ఘన విజయం సాధించిన ఆప్‌కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ అధినేత.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వరుసగా మూడు సార్లు ఢిల్లీ పీఠంపై పైచేయి సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు.. శుభాకాంక్షలు తెల్పుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేజ్రీవాల్ ఘన విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ట్వీట్‌కు వెంటనే ప్రతిస్పందించారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:44 pm, Tue, 11 February 20
"మీతో కలిసి పనిచేస్తా".. మోదీకి సప్రైజ్ ఇచ్చిన కేజ్రీ..!

ఢిల్లీలో ఘన విజయం సాధించిన ఆప్‌కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ అధినేత.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వరుసగా మూడు సార్లు ఢిల్లీ పీఠంపై పైచేయి సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు.. శుభాకాంక్షలు తెల్పుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేజ్రీవాల్ ఘన విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ట్వీట్‌కు వెంటనే ప్రతిస్పందించారు అరవింద్ కేజ్రీవాల్.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్‌కు, అరవింద్‌ కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్‌. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానంటూ ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌పై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. థాంక్యూ సో మచ్‌ సార్‌ అంటూ రిప్లై ఇచ్చారు. న్యూఢిల్లీని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు మీతో (కేంద్రం) కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ 62 సీట్లు కైవసం చేసుకోగా, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఖాతా కూడా తెరువలేదు.