AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. జూలై 12 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని జూలై 12 వరకు పొడిగించారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం (జూలై 3) జ్యుడీషియల్ కస్టడీ కాలాన్ని పొడిగిస్తూ తీర్పునిచ్చింది.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. జూలై 12 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
Arvind Kejriwal
Balaraju Goud
|

Updated on: Jul 03, 2024 | 4:14 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని జూలై 12 వరకు పొడిగించారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం (జూలై 3) జ్యుడీషియల్ కస్టడీ కాలాన్ని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 2024 మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. కాగా, మెడికల్ బోర్డుతో సంప్రదింపుల సమయంలో తన భార్యను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరు కావడానికి అనుమతించాలని డిమాండ్ చేసిన సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. జులై 6న కోర్టు తీర్పు వెలువరించనుంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌కు కష్టాలు రెట్టింపయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐకి సంబంధించిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది. సీఎం కేజ్రీవాల్‌ను అక్రమ నిర్బంధంలో ఉంచారని, చట్టాన్ని పాటించడం లేదని కేజ్రీవాల్ తరుఫు న్యాయవాది రజత్ భరద్వాజ్ ఆరోపించారు.

ఈ కేసులో గురువారం విచారణకు న్యాయవాది అప్పీల్ చేయగా, జస్టిస్ మన్మోహన్, “మొదట న్యాయమూర్తులు పేపర్‌లను చూడనివ్వండి.. ఆ తర్వాత కేసును మరుసటి రోజు విచారిస్తాం” అని తేల్చి చెప్పారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. సీబీఐ కస్టడీ ముగిసిన వెంటనే సీబీ అరెస్ట్ చేసింది. మూడు రోజుల పాటు ఆయన్ను సీబీఐ విచారించింది. కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు కేజ్రీవాల్‌కు జులై 12 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో కేజ్రీవాల్‌ను మళ్లీ తిహార్‌ జైలుకు తరలించారు. కేజ్రీవాల్‌ విచారణకు సహకరించడం లేదని , తమ ప్రశ్నలకు కేజ్రీవాల్‌ పొంతనలేని సమాధానం చెప్పారని కోర్టుకు సీబీఐ తెలిపింది.

అయితే సీబీఐ తప్పుడు ఆరోపణలు చేస్తోంది కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది విక్రం చౌదరి తెలిపారు. సీబీఐ దగ్గర ఉన్న సాక్ష్యాలను వెంటనే కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీబీఐ ఈ కేసులో ఇప్పటివరకు నాలుగు చార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాను కూడా నిందితులుగా పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేజ్రీవాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈడీ కస్టడీలోనే తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను అదే కేసులో సీబీఐ అరెస్ట్‌ చేసింది. కస్టడీ ముగియడంతో ఆయన్ను కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్‌ శ్రేణులు భారీ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…