Delhi Violence: ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. పోలీసులపై కాల్పులు జరిపిన అస్లాం..

ఢిల్లీలోని జహంగీర్‌పురి హింసలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హింస సమయంలో, దుండగులు కూడా కాల్పులు జరిపారు. ఇది ASIను తాకింది. ఈ ఘటనలో..

Delhi Violence: ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. పోలీసులపై కాల్పులు జరిపిన అస్లాం..
Jahangirpuri Violence
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 17, 2022 | 1:39 PM

ఢిల్లీలోని జహంగీర్‌పురి హింసలో(Delhi Violence) కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హింస సమయంలో, దుండగులు కూడా కాల్పులు జరిపారు. ఇది ASIను తాకింది. ఈ ఘటనలో ఏఎస్ఐకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ బుల్లెట్‌ను అస్లాం అనే వ్యక్తి కాల్చినట్లుగా పోలీసలు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపుపై రాళ్లదాడి జరిగింది. ఈ హింసాకాండలో 8 మంది పోలీసులతో సహా 9 మంది గాయపడ్డారు. హింసాకాండకు పాల్పడిన అస్మాల్‌తో సహా  14 మందిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

అన్సార్ అనే వ్యక్తి ప్రజలతో వాగ్వాదానికి దిగాడు

ఎఫ్‌ఐఆర్ కాపీ ప్రకారం.. శోభా యాత్ర జహంగీర్‌పూర్‌లోని సి బ్లాక్‌లోని జామా మసీదు సమీపంలోకి చేరుకున్న సమయంలో అన్సార్ అనే వ్యక్తి తన నలుగురు సహచరులతో కలిసి అక్కడి చేరుకున్నాడు. ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత వివాదం ముదిరి రాళ్లదాడి మొదలైంది. అరెస్టయిన 15 మందిలో అన్సార్ కూడా ఉండటం విశేషం.

అన్సార్‌పై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి

అన్సార్‌పై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఊరేగింపును శాంతియుతంగా బయటకు తీసుకెళ్తున్నామని, వాగ్వాదం తర్వాత రాళ్లతో దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇరువైపులా రాళ్ల దాడి జరిగిందని తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఏం రాసి ఉంది?

  • సాయంత్రం 6 గంటలకు ఊరేగింపు జహంగీర్‌పురిలోని జామా మసీదుకు చేరుకుంది.
  • అన్సార్ అనే వ్యక్తి 4-5 మంది సహచరులతో వచ్చాడు.
  • శోభా యాత్రలో పాల్గొన్న వారితో అన్సార్ వాగ్వాదానికి దిగారు.
  • వాగ్వాదం పెరిగి రాళ్లదాడికి దిగారు.
  • హింసను నియంత్రించేందుకు 40-50 టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
  • జనం వైపు నుంచి కూడా కాల్పులు జరిపారు.
  • బుల్లెట్ గాయం కారణంగా ఎస్‌ఐ మెడలాల్‌కు గాయాలయ్యాయి.
  • కాల్పులు, రాళ్లదాడితో మత కలహాలు చెలరేగాయి.

మరోవైపు ఢిల్లీలో ఘర్షణల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఆదివారమూ పలు ప్రాంతాల్లో మతపరమైన ర్యాలీలు ఉన్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి గొడవ జరిగినా వెంటనే స్పందించి జనం గుమికూడకుండా జాగ్రత్తపడాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేశారు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు.. పార్కింగ్‌ ఫీజుల పేరుతో మొదలైన వసూళ్ల దందా..

Delhi Violence: ఢిల్లీ హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు..

Viral Video: ఆక్సిజన్ మాత్రమే కాదు దాహం తీరుస్తోంది.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..