Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర్‌పై కీలక అప్‌డేట్‌.. ఎప్పుడు ప్రారంభిస్తారో తెలిపిన ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామ మందిరం 2024 జనవరి రెండోవారం నాటికి సిద్ధమవుతుందని..

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర్‌పై కీలక అప్‌డేట్‌.. ఎప్పుడు ప్రారంభిస్తారో తెలిపిన ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి
Ayodhya Ram Mandir
Follow us

|

Updated on: Apr 17, 2022 | 12:33 PM

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామ మందిరం 2024 జనవరి రెండోవారం నాటికి సిద్ధమవుతుందని రామ జన్మభూమి మందిర్‌ (Janmabhoomi Temple)తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ (Champat Rai) చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలో ఆయోధ్య పర్వ్‌ కార్యక్రమంలో మాట్లాడారు. 2024లో మకర సంక్రాంతి రోజున రామాలయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి మందిర నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. రాళ్లను చెక్కే పని ఇప్పటికే మొదలయ్యిందన్నారు.

అయితే ఎలాంటి విపత్తులు వచ్చినప్పటికి తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. గర్భగుడి నిర్మాణం అవుతున్న చోట 14 మీటర్ల వరకు భూమి లోపల పునాది నిర్మాణం, మిగతా చోట 12 మీటర్ల ఎత్తులో పునాది నిర్మాణాన్ని పూర్తి చేశారు. వివిధ రకాల కాంక్రీట్‌తో పునాది నిర్మాణం జరిగింది. అయితే 2023 డిసెంబర్‌ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. 2024 నాటికి భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఇటుకలు , స్టీల్‌ను వినియోగించకుండా రాజస్థాన్‌కు చెందిన పాలరాతితో ఆలయ నిర్మాణం జరుగుతోంది. రాముడు కూర్చునేందుకు గ్రానైట్‌తో ఆరడుగుల ఎత్తైన కుర్చీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో పునాది, ఇతర పనులు పూర్తవుతాయని అన్నారు.

అయోధ్యలో 2020లో ఆగస్ట్‌ 5వ తేదీన భూమి పూజ జరిగింది. ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. మూడంతస్తుల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Weekly Horoscope: వార ఫలాలు.. ఏప్రిల్‌ 17 నుంచి 23 వరకు ఈ రాశుల వారికి అనుకూలం..

Shani Dev: ఉద్యోగం రావడం లేదా? ఏ ప్రయత్నమూ సక్సెస్ అవడం లేదా? అయితే శనివారం రోజు ఇలా చేయండి..!

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే