AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress on Mamata: దేశంలో యూపీఏ లేదన్న బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతాకు గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) లేదని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది.

Congress on Mamata: దేశంలో యూపీఏ లేదన్న బెంగాల్ ముఖ్యమంత్రి..  మమతాకు గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..!
Congress On Mamata
Balaraju Goud
|

Updated on: Dec 02, 2021 | 7:25 AM

Share

Congress o Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) లేదని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం ఆమె మాటలను తప్పుబట్టారు. కాంగ్రెస్ లేకుండా భారతీయ జనతా పార్టీని ఓడించడం కేవలం కల మాత్రమే అని అన్నారు.”భారత రాజకీయాల వాస్తవికత అందరికీ తెలుసు. కాంగ్రెస్ లేకుండా ఎవరైనా బీజేపీని ఓడించగలరని అనుకోవడం కేవలం కల మాత్రమే” అని వేణుగోపాల్ చెప్పారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. బుధవారం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో టీఎంసీ అధినేత భేటీ అయ్యారు. మంగళవారం ఆమె శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లతో సమావేశమయ్యారు. అక్కడ ఆమె ప్రతిపక్ష పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు శరద్ పవార్‌తో ఆమె సమావేశమైన తర్వాత, “ఇప్పుడు యుపీఏ లేదు” అని ఆమె తేల్చి చెప్పినట్లు తెలిసింది. “కాంగ్రెస్ బెంగాల్‌లో పోటీ చేస్తుంటే, నేను గోవాలో ఎందుకు చేయలేను?” అని ముంబైలో విపక్ష నేతల సమావేశంలో మమతా బెనర్జీ అన్నారు. బీజేపీతో పోరాడటం ముఖ్యమని, లేకుంటే వారు మిమ్మల్ని ఔట్ చేస్తారని అన్నారు. “రాజకీయంగా బీజేపీని ఈ దేశం వెలుపల చూడాలనుకుంటున్నాను… ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఉంటే బీజేపీని ఓడించడం సులువు. రాష్ట్రంలో పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ బెంగాల్ నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. తద్వారా ఇతరులు కూడా బయటకు వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం ఉంది” అని ఆమె అన్నారు.

ఇదిలావుండగా, శరద్ పవార్‌ను ఇరుకున పెట్టేందుకు బెనర్జీ కుట్ర పన్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. శరద్ పవార్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏమీ అనలేదు. ఆయన సీనియర్ నాయకుడు. మేము ఆయనను చాలా గౌరవిస్తాం. శరద్ పవార్‌తో పాటు ఇతర పార్టీల వ్యక్తులను ఇరుకున పెట్టి బీజేపీకి ప్రత్యామ్నాయం చూపేందుకు మమతా బెనర్జీ ముందస్తుగా పన్నిన కుట్ర. ఇది బీజేపీకి అత్యంత లాభిస్తోంది. అని అధిర్ రంజన్ అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ బీజేపీకి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నందున ఆమె పట్ల కేంద్రం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

“భారతదేశం అంతటా బీజేపీ పోరాడుతున్నప్పుడు వారి పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నప్పుడు, మమతా బెనర్జీ వారికి ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీ బీజేపీకి ఆక్సిజన్ సరఫరాదారుగా మారారు” అని ఆయన అన్నారు. యూపీఏ అంటే ఏమిటో మమతా బెనర్జీకి తెలియదా? ఆమెకు పిచ్చి మొదలైందని నేను అనుకుంటున్నాను అంటూ కాంగ్రెస్ నేత ఏఆర్ చౌదరి మండిపడ్డారు. యావత్ భారతదేశం ‘మమతా, మమతా’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించిందని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ భారతదేశం అంటే బెంగాల్ కాదు, బెంగాల్ మాత్రమే భారతదేశం అని కాదు. గత ఎన్నికల్లో ఆమె వ్యూహాలు త్వరలో బహిర్గతమవుతున్నాయన్నారు.

Read Also… Covishield:ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాల నేపథ్యంలో సీరమ్ అలర్ట్.. కోవిషీల్డ్‌ బూస్టర్‌ కోసం డీసీజీఐకు దరఖాస్తు