AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్లు మూసుకుని కూల్‌డ్రింక్‌ తాగేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌..దాంట్లో వచ్చింది చూస్తే గుడ్లు తేలేసుడు గ్యారెంటీ..!

అహ్మదాబాద్‌లోని సైన్స్‌ సిటీ రోడ్డులో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌ కస్టమర్‌ కూల్‌డ్రింక్‌లో బల్లి కనిపించడంతో భయాందోళనలు సృష్టించారు. కూల్‌డ్రింక్‌ తాగిన బాధితుడు ఈ విషయాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సమాచారం అందించాడు.

కళ్లు మూసుకుని కూల్‌డ్రింక్‌ తాగేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌..దాంట్లో వచ్చింది చూస్తే గుడ్లు తేలేసుడు గ్యారెంటీ..!
Dead Lizard
Follow us
Jyothi Gadda

|

Updated on: May 24, 2022 | 8:52 PM

అహ్మదాబాద్‌లోని సైన్స్‌ సిటీ రోడ్డులో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌ కస్టమర్‌ కూల్‌డ్రింక్‌లో బల్లి కనిపించడంతో భయాందోళనలు సృష్టించారు. కూల్‌డ్రింక్‌ తాగిన బాధితుడు ఈ విషయాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సమాచారం అందించాడు. అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మెక్‌డోనాల్డ్స్ ని సీల్‌ చేసింది. పూర్తి వివరాలు పరిశీలించగా,.. ఇద్దరు స్నేహితులు మెక్‌డోనాల్డ్స్‌ లో కూల్‌డ్రింక్‌ తాగుతున్నారు. ఈ క్రమంలోనే కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి బయటకు రావడం కలకలం రేపింది. యువకులిద్దరూ జరిగిన విషయాన్ని మొత్తం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తెలిపారు. సమచారం అందుకున్న మున్సిపల్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు కూల్‌ డ్రింక్‌ నమూనాలను సేకరించి తనిఖీ కోసం పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరికి పంపారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న మెక్‌డోనాల్డ్స్‌ కు నోటీసులు జారీ చేసింది.

భార్గవ జోషి అనే కస్టమర్ మెక్‌డొనాల్డ్స్ అందించిన కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో AMC అధికారులు చర్యలు తీసుకున్నారు. తదుపరి చర్యలు తీసుకునే వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని కూడా ఆదేశించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి లేకుండా మళ్లీ ప్రారంభించరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో జరిగిన ఘటనపై మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది.

ఇవి కూడా చదవండి

మెక్‌డొనాల్డ్స్ తన ప్రకటనలో ఇలా పేర్కొంది- మేము మా కస్టమర్ల భద్రత, పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తాము. అహ్మదా బాద్ అవుట్‌లెట్‌లో జరిగిన సంఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నాము. అయితే, ఇలాంటి పొరపాటు ఎలా జరిగిందనే దానిపై బాధ్యతగల పౌరులుగా అధికారుల విచారణకు మా వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.