ఈ రైలు ప్రయాణం ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా! కానీ, అక్కడికి వెళ్తేనే చూడగలం, అందులో ప్రయాణించగలం..

ఈ రైలు ప్రయాణం ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా! కానీ, అక్కడికి వెళ్తేనే చూడగలం, అందులో ప్రయాణించగలం..
Upside Down Railway

మన దేశంలో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతం, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. విమానయానం, రోడ్డు మార్గాల్లో వెళ్లే ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ రైలు ప్రయాణంలో ఉన్న ఫీల్‌ మరెక్కడా లభించదు..

Jyothi Gadda

|

May 24, 2022 | 6:32 PM

మన దేశంలో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతం, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. విమానయానం, రోడ్డు మార్గాల్లో వెళ్లే ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ రైలు ప్రయాణంలో ఉన్న ఫీల్‌ మరెక్కడా లభించదు..చాలా మందికి రైలు ప్రయాణంతో ఎన్నో కథలు, మరెన్నో మధురానుభూతులు ఉంటాయి. రైళ్లో ప్రయాణించేటప్పుడు వచ్చే శబ్దం, కిటికీ నుంచి కనిపించే అందమైన దృశ్యాలు, తోటి ప్రయాణికులతో కబుర్లు ఇలా చెప్పుకుంటూ పోతే రైలు ప్రయాణానికి మించింది మరొకటి ఉండదనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైళ్లలో ప్రయాణిస్తున్నపుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

మన దగ్గర ఇలా ఉంటే, జపాన్‌, జర్మనీలో మాత్రం రైలు ప్రయాణం అంటే అదొక సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చూసినట్టే..అక్కడ తలకిందులుగా ప్రయాణించే రైళ్లు మనల్ని అబ్బురపరుస్తాయి. ఒక ట్రాక్ కింద వేలాడుతూ రైళ్లు రోడ్లు, నదులు, ఇతర నిర్మాణాల మీదుగా కదులుతుంటాయి. ఇంజినీర్‌ యూజెన్ లాంగెన్ 1893లో ఈ సస్పెన్షన్ వ్యవస్థను అందించారు. అంటే అప్పటి నుంచే ఈ రైళ్లు ప్రపంచానికి పరిచయం అయ్యాయన్నమాట..కానీ, తాజాగా జర్మనీ రైలు ప్రయాణం గురించిన ఓ వీడియో పిట్టగూటిలో చేరి హల్‌చల్‌ చేస్తోంది. దాంతో మరోమారు ఈ ఉల్టా జర్నీ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ప్రస్తుతం రోజూ 82వేలమందిని ఈ రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇలాంటి రైళ్లను చూడాలన్నా, అందులో ప్రయాణించాలన్న అక్కడికి వెళ్లాల్సిందే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu