Danish Siddiqui: భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీని తాలిబన్లే కాల్చి చంపారు.. ఆఫ్ఘన్ భద్రతాదళాల ధ్రువీకరణ

భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీని తాలిబన్లే కాల్చి చంపారని, వారే పొట్టన బెట్టుకున్నారని ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాల అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు

Danish Siddiqui: భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీని తాలిబన్లే కాల్చి చంపారు.. ఆఫ్ఘన్ భద్రతాదళాల ధ్రువీకరణ
Danish Siddiqui
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 02, 2021 | 9:42 AM

భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీని తాలిబన్లే కాల్చి చంపారని, వారే పొట్టన బెట్టుకున్నారని ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాల అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తమకు, తాలిబన్లకు మధ్య జరిగిన క్రాస్ ఫైరింగ్ లో అతడు మరణించలేదని, తాలిబన్లు మొదట అతడిని ‘అరెస్టు’ చేశారని (నిర్బంధించారని). అనంతరం పట్టుకుని ‘మరణశిక్ష’ విధించారని అజ్మల్ ఒమర్ షిన్వారీ అనే ఈ ప్రతినిధి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ జర్నలిస్టును పట్టుకున్న ప్రాంతం వారి అధీనంలో ఉందని, అందువల్లే ఈ ఘటనపై తాము సాక్షులను గుర్తించడానికి చాలా సమయం పట్టిందని ఆయన చెప్పారు. తాలిబన్లు డానిష్ ని పట్టుకున్నప్పుడు అతడు సజీవంగానే ఉన్నాడని, అతని ఐడెంటిటీ తెలుసుకున్న అనంతరం వారు అతడిని. మరో ముగ్గురు ఆఫ్ఘన్ సైనికులను కూడా హతమార్చారని ఆయన పేర్కొన్నారు. కాందహార్ లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో తాలిబన్లకు, ఆఫ్ఘన్ దళాలకు మధ్య జరిగిన పోరులో సిద్దిఖీ మరణించినట్టు మొదట వార్తలు వచ్చాయి. రాయిటర్స్ వార్తా సంస్థ తరఫున పని చేస్తున్న ఈయన పులిట్జర్ అవార్డు గ్రహీత కూడా.

]డానిష్ సిద్దిఖీది హత్యేనని అమెరికాలోని ఓ డైలీ గతవారం తెలిపింది. ఆఫ్ఘన్ దళాలతో వెళ్తున్న ఓ బృందంపై తాలిబన్లు కాల్పులు జరిపారని, ఆ సమయంలో సిద్దిఖీ, మరికొందరు ఓ మసీదులోకి వెళ్లి దాక్కోగా తాలిబన్లు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారని, అనంతరం సిద్దిఖీ ఐడెంటిటీ తెలుసుకుని హతమార్చారని ఈ డైలీ పేర్కొంది. తాలిబన్లకు పాకిస్థాన్ నిధులిచ్చి ప్రోత్సహిస్తోందని, తమదేశంలో జైషే మహమ్మద్, అల్-ఖైదా టెర్రరిస్టులు చాలామంది ఉన్నారని అజ్మల్ ఒమర్ తెలిపారు. కాగా=డానిష్ సిద్దిఖీని తాము చంపలేదని, జర్నలిస్టులను తాము హతమార్చబోమని, కానీ వార్ జోన్ లోకి వచ్చేముందు వారు తమకు ముందుగా తెలియజేయాలని తాలిబన్లు మొదట్లో చెప్పిన విషయం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చూడండి: Sukumar: డైరెక్టర్ సుకుమార్ పెద్ద మనసు.. తండ్రి జ్ఞాపకార్థంగా సొంత గ్రామంలో…

ధన్ బాద్ జడ్జి మర్డర్ పై ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 53 హోటళ్లలో గాలింపు.. 243 మంది అనుమానితుల ఇంటరాగేషన్