కుక్కపై క్రూరత్వం.. బండికి కట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు
మూగజీవి పట్లు ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. తన మోటార్ సైకిల్ కు కుక్కను కట్టి దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు.

మూగజీవి పట్లు ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. తన మోటార్ సైకిల్ కు కుక్కను కట్టి దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గాజియబాద్ జిల్లాలో శనివారం వెలుగుచూసింది. ఇస్మాయిల్ అనే వ్యక్తి ఇలా ఆ కుక్కను తన వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్తన్నాడు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాబ్ విహార్ ఔట్ పోస్ట్ సమీపానికి రాగానే కుక్కను విచక్షణ రహితంగా ఈడ్చుకెళ్తున్న ఆ వ్యక్తిని స్థానికులు గమనించారు. ఇస్మాయిల్ ను వెంబడించి ఆపారు. అనంతరం పీపుల్స్ ఫర్ యానిమల్స్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఇస్మాయిల్ ని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతనిపై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అయితే ఈ సంఘటనపై విచారించిన పోలీసులు ఇలా ఎందుకు చేశావని ఆ నిందితుడ్ని ప్రశ్నించదగా అతను ఆసక్తికరమైన విషయం బయటపెట్టాడు. ఆ కుక్క చాలా మందిని కరిచిందని తెలిపాడు. ఇటీవలే ఐదుగురిని కరిచి గాయపరిచిందని చెప్పాడు. అందుకే దాన్ని పట్టుకుని దూరంగా వదిలేయడానికి తీసుకెళ్తున్నానని తెలిపాడు. అయితే నిందితుడు కుక్కను కిలో మీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లడం కళ్లారా చూసామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన కుక్కను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలని పీఎప్ఐ సభ్యులు నిందితుడికి చెప్పారు. ప్రస్తుతం అతను కుక్కను ఈడ్చుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
