AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రజినీకాంత్ పెద్ద కూతురు ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎవరు, ఎంత దోచుకెళ్లారంటే

సాధారణంగా ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రీటల ఇంట్లో దొంగతనం జరిగితే దాని గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.

రజినీకాంత్ పెద్ద కూతురు ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎవరు, ఎంత దోచుకెళ్లారంటే
Aishwarya Laxmi
Aravind B
|

Updated on: Mar 20, 2023 | 9:39 AM

Share

సాధారణంగా ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రీటల ఇంట్లో దొంగతనం జరిగితే దాని గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇప్పడు అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, ఫిల్మ్ మేకర్ అయిన ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఉన్న డైమండ్స్, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. అయితే ఆ దొంగలు కూడా తన ఇంట్లో పని చేసే ముగ్గురు వ్యక్తుల పైనే అనుమానం ఉందని ఐశ్వర్య లక్ష్మీ పోలీసులు ఫిర్యాదు చేసింది. దాదాపు రూ. 7 లక్షల విలువైన నగలు, వజ్రాలను తన ఇంట్లో పని చేసే ముగ్గురు వ్యక్తులే ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో తెలిపింది.

2019లో తన చెల్లెలుల సౌందర్య పెళ్లి తర్వాత ఆ నగలను తన లాకర్ రూంలో పెట్టానని తెలిపింది. 2021 ఆగస్టు వరకు ఆ లాకర్ సెయింట్ మేరీస్ రోడ్డులో ఉన్న తన అపార్ట్ మెంట్ లోనే ఉందని.. ఆ తర్వాత నటుడు ధనుష్ తో ఉన్నప్పుడు దాన్ని అక్కడికి మార్చినట్లు పేర్కొంది. మళ్లీ అక్కడి నుంచి 2021 సెప్టెంబర్ లో తిరిగి సెయింట్ మెరీస్ రోడ్డులో ఉన్న తన అపార్ట్ మెంట్ లోకే చేర్చానని తెలిపింది. 2022 ఏప్రిల్ 9న రజినికాంత్ పోస్ గార్డెన్ ఇంటికి షిప్ట్ చేసినట్లు ఐశ్వర్య లక్ష్మీ చెప్పింది. ఆ లాకర్ కి సంబంధించిన తాళాలు తన అపార్ట్ మెంట్ లోనే స్టీల్ కప్ బోర్డులో ఉండేవని.. అవి తన ఇంట్లో పనిచేసే సిబ్బందికి తెలుసని తెలిపింది. అయితే ఫిబ్రవరి 10న తన నగలు, డైమండ్లు ఒక్కసారిగా మాయమయ్యాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఐశ్వర్య లక్ష్మీ లాల్ సలామ్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రంలో ఆమె తండ్రి రజినికాంత్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..