AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గగన్‌యాన్ మిషన్‌పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో.. వ్యోమగాములు అడుగు పెట్టేదెప్పుడంటే?

2040 నాటికి భారత్ నుంచి వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇందుకు అనుసంధానంగా మరో కీలక ప్రయోగం చంద్రుడిపైకి జరగనుంది. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. స్రో దశలవారీగా ఒక్కొక్క ప్రయోగాత్మక ప్రయోగాలను చేపడుతూ వస్తోంది.

గగన్‌యాన్ మిషన్‌పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో.. వ్యోమగాములు అడుగు పెట్టేదెప్పుడంటే?
Isro Chief Narayanan
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 15, 2025 | 7:33 PM

Share

2040 నాటికి భారత్ నుంచి వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇందుకు అనుసంధానంగా మరో కీలక ప్రయోగం చంద్రుడిపైకి జరగనుంది. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు.

చంద్రుడిపై రహస్యాలను తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్ సిరీస్ లో మూడు ప్రయోగాలను చేపట్టింది.. ప్రపంచంలో నాసా సహా ఏ దేశం కనిపెట్టలేని రహస్యాలను చంద్రయాన్ ప్రయోగాల ద్వారా ఇస్రో ప్రపంచానికి తెలియజేసింది. చంద్రుడిపై ప్రయోగం కోసం మానవులను పంపేందుకు ఐదేళ్ల క్రితమే ఇస్రో శ్రీకారం చుట్టింది. గగన్యాన్ అనే పేరును ఈ ప్రాజెక్టుకు నామకరణం చేసిన ఇస్రో దశలవారీగా ఒక్కొక్క ప్రయోగాత్మక ప్రయోగాలను చేపడుతూ వస్తోంది.

అంతరిక్షంలో ప్రపంచ దేశాలలో కీలకమైన ప్రయోగాలు చేపడుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇస్రో చీఫ్ వి నారాయణన్ భారతదేశ ప్రధాన అంతరిక్ష లక్ష్యాలపై దృష్టి పెట్టారు. దేశ మొట్టమొదటి మానవ అంతరిక్ష విమాన మిషన్ కోసం ప్రయోగ షెడ్యూల్‌ను ధృవీకరిస్తూ.. చంద్ర అన్వేషణ, అంతర్జాతీయ భాగస్వామ్యం కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను వివరించారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష విమాన మిషన్ 2040 లో జరగనున్నట్లు ప్రకటించారు.

గగన్‌యాన్ మ్యాన్ మిషన్ లో భాగంగా 2027లో కీలక ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇది మానవ రహిత ప్రయోగంగా ఉంటుందని.. చంద్రుడిపై వ్యోమగాములు ఏ ప్రాంతంలో దిగాలు ముందుగానే నిర్దేశించుకుని అక్కడ ఉన్నటువంటి వాతావరణం అధ్యయనం చేసి కీలకమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు 2027లో ఈ మానవ రహిత ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.

భారతదేశ అంతరిక్ష ఘనత గురించి ప్రస్తావిస్తూ ఇస్రో చీఫ్ వి నారాయణన్ దేశం తొమ్మిది అంతరిక్ష విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ఇస్రో సాధించిన విజయాలు చంద్రయాన్-1 మిషన్ ద్వారా చంద్రునిపై నీటిని కనుగొనడం నుండి చంద్రయాన్-3 మిషన్‌తో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర మొదటి సేఫ్ ల్యాండింగ్‌ను చేపట్టడం వరకు ఉన్నాయన్నారు. 2040 నాటికి భారతదేశం మొట్టమొదటి మానవులతో కూడిన మూన్ మిషన్ కోసం ప్రధానమంత్రి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారని, ఆ తర్వాత మనుషులను చంద్రునికి, తిరిగి భూమికి రవాణా చేయగల సామర్థ్యాన్ని ఇస్రో చేపట్టగలిగే విధంగా ఉంటుందన్నారు. ఆదిత్య L1 విజయం: ఆదిత్య L1 మిషన్ ఇప్పటికే 15 టెరాబిట్‌లకు పైగా సౌర డేటాను అందించింది. ఇది కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు, అంతరిక్ష వాతావరణంపై లోతైన సమాచారాన్ని తెలుసుకోగలిగామన్నారు.

హెవీ-లిఫ్ట్ రాకెట్: ఇస్రో తన భవిష్యత్ ఆశయాల కోసం 80,000 కిలోల బరువును లోయర్ ఎర్త్ ఆర్బిట్‌కు తీసుకెళ్ళగలిగిన రాకెట్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతున్నట్లు ఇస్రో ఛైర్మన్ చెప్పారు. ఇప్పటిదాకా 5 టన్నుల బరువుగల ఉపగ్రహాలను నీలోకి పంపడం కోసం భారీ రాకెట్లను ఇస్రో తయారు చేసింది. అన్న రోజుల్లో మరింత సామర్థ్యాన్ని పెంచి ఎనిమిది టన్నుల బరువున్న ఉపగ్రహాలను కూడా పక్షులకు ప్రవేశ పెట్టగలిగే దిశగా భారీ వాహక నౌకను తయారు చేసేందుకు సంసిద్దమవుతున్నట్టు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..