CoWIN Portal: ఇక నుంచి మరింత సులభతరం.. ప్రాంతీయ భాషల్లోనూ టీకా రిజిస్ట్రేషన్‌.. కేంద్రం కీలక నిర్ణయం

CoWIN Portal: కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మందికి టీకాలు వేశారు. కరోనా టీకా రిజిస్ట్రేషన్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన..

CoWIN Portal: ఇక నుంచి మరింత సులభతరం.. ప్రాంతీయ భాషల్లోనూ టీకా రిజిస్ట్రేషన్‌.. కేంద్రం కీలక నిర్ణయం
CoWIN Portal
Follow us

|

Updated on: Jun 04, 2021 | 12:22 PM

CoWIN Portal: కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మందికి టీకాలు వేశారు. కరోనా టీకా రిజిస్ట్రేషన్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొవిన్ పోర్టల్.. ఇప్పుడు హిందీతో సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా మార్పులు చేసినట్లు వెల్లడించింది. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందాలంటే..

కాగా, దేశంలో 18ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందాలంటే కొవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో భాష కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించిన అధికారులు.. ప్రాంతీయ భాషలను అందుబాటులోకి తీసుకువచ్చింది. భాష ఇబ్బందుల కారణంగా ప్రజలు టీకా కేంద్రాల్లోని సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు. దానివల్ల సిబ్బందిపై ఒత్తిడి పడుతుందని గుర్తించిన ప్రభుత్వం.. హిందీతో సహా పలు ప్రాంతీయ భాషల్లోకి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. వారిపై ఒత్తిడి తగ్గడం వల్ల ఎక్కువ మందికి టీకా ఇచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా జనవరిలో ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 22కోట్ల మందికిపైగా టీకాలు అందాయి. కరోనా కట్టడి నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రయను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. తగినన్ని వ్యాక్సిన్లను ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తూ టీకా కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం.

ఇవీ కూడా చదవండి:

India Corona Updates: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

NRI Yusuffali: మనసున్న మహరాజు… కోటి రూపాయలు చెల్లించి ఉద్యోగి ప్రాణాలు నిలబెట్టాడు..