AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే ……కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ

కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామకాలాన్ని పొడిగించాలన్న నిర్ణయంలో ఎలాంటి పొరబాటు లేదని, పారదర్శకంగా..శాస్త్రీయ పరమైన డేటాపై ఆధారపడే దీన్ని తీసుకోవడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ తెలిపారు

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే ......కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ
Union Minister Harsh Vardha
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 16, 2021 | 4:44 PM

Share

కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామకాలాన్ని పొడిగించాలన్న నిర్ణయంలో ఎలాంటి పొరబాటు లేదని, పారదర్శకంగా..శాస్త్రీయ పరమైన డేటాపై ఆధారపడే దీన్ని తీసుకోవడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ తెలిపారు. ఈ గ్యాప్ ను మొదట 6 నుంచి 8 వారాలకు.. ఆ తరువాత 8 నుంచి..12.. అనంతరం 16 వారాలకు పెంచడంపై తలెత్తిన అయోమయంపై ఆయన స్పందిస్తూ.. నిపుణులందరి ఏకాభిప్రాయంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు. శాస్త్రీయ పరమైన డేటాను ఆధారంగా చేసుకుని, ఎలాంటి అరమరికలకు తావు లేకుండా ఈ విరామ కాలాన్ని పెంచాం…ఇండియాలో డేటా మెకానిజం విస్తృతంగా ఉంది..ఒక ముఖ్యమైన సమస్యను రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. ఇమ్యునైజేషన్ పై గల నేషనల్ టెక్నీకల్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ డా.ఎన్.కె. అరోరా ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఆయన తన ట్విటర్ కు జోడించారు.

వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12 వారాలు ఉన్నప్పుడు దాని సామర్థ్యం 65 నుంచి 88 శాతం ఉంటుందని బ్రిటన్ లోని పబ్లిక్ ఇంగ్లాండ్ హెల్త్ రెగ్యులేటరీ స్పష్టం చేసిందని అరోరా వెల్లడించారు. అంటే విరామ కాలం పెరిగినప్పుడు టీకామందు సామర్థ్యం కూడా ఎక్కువ అవుతుందని తాము భావించామన్నారు. కోవిద్ వర్కింగ్ గ్రూప్ లో అందరూ ఈ అభిప్రాయంతో ఏకీభవించినట్టు అయన తెలిపారు. ఈ కారణంగానే కోవీషీల్డ్ వ్యాక్సిన్ మధ్య గ్యాప్ ను 12 నుంచి 16 వారాలకు పెంచినట్టు ఆయన పేర్కొన్నారు.

అయితే ముగ్గురు శాస్త్రజ్ఞులు మాత్రం తాము ఈ గ్యాప్ ను 8 నుంచి 12 వారాలకు పెంచడంపైనే చర్చించినట్టు తెలిపారు. కాగా అసలు ఈ అంశంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గానీ…. ఐసీఎంఆర్ గానీ ఇప్పటివరకు స్పందించక పోవడం విశేషం.

మరిన్ని ఇక్కడ చూడండి: డొమెస్టిక్ క్రికెట్‌లో పెను విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగిన బ్యాట్స్‌మెన్.. ఎవరంటే.!

Corona Testing: కేవలం 15 నిమిషాల్లోనే గదిలో కరోనాను గుర్తించే కొత్త పరికరాన్ని కనుగొన్న బ్రిటిష్ శాస్త్రవేత్తలు