Taj Mahal Reopens Today: రెండు నెలల తర్వాత తెరుచుకున్న తాజ్ మహల్.. సందర్శకులకు మార్గదర్శకాలు జారీ

Taj Mahal Reopens Today: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి అడ్డుకట్టవేయడానికి అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న...

Taj Mahal Reopens Today: రెండు నెలల తర్వాత తెరుచుకున్న తాజ్ మహల్.. సందర్శకులకు మార్గదర్శకాలు జారీ
Taj Mahal
Follow us

|

Updated on: Jun 16, 2021 | 4:11 PM

Taj Mahal Reopens Today: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి అడ్డుకట్టవేయడానికి అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. తాజాగా ఆగ్రాలోని తాజ్ మహల్ రెండు నెలల తర్వాత ఈరోజు తిరిగి ఓపెన్ చేశారు. అయితే తాజ్ మహల్ ను సందర్శించాలను కునే పర్యాటకులకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు అధికారులు.

కోవిద్ నిబంధనలు అనుసరిస్తూ.. తాజ్ మహల్ సందర్శనానికి ఒకే సమయంలో 650 మందిని మాత్రమే లోపలికి అనుమతించనున్నామని చెప్పారు.

తాజ్ మహల్ సందర్శించే ప్రజలు అనుసరించాల్సిన మార్గదర్శకాలు :

1. అన్ని కోవిడ్-ప్రోటోకాల్‌లు పాటించేలా పర్యాటకులను పర్యవేక్షించడానికి బృందాలను మోహరించనున్నారు.

2. తాజ్ మహల్ ను రోజుకు మూడుసార్లు పరిశుభ్రపరచనున్నారు.

3. ఇక నుంచి తాజ్ మహల్ ను సందర్శించాలంటే ఆన్‌లైన్ లో మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. ప్రాంగణంలోని టికెట్ కౌంటర్ తెరవబడదని అధికారులు తెలిపారు. అంతేకాదు ఒక ఫోన్ నెంబర్ కు ఐదు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకొనే వీలుంది

4. సందర్శకులందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి. స్మారక ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయబడతారు. అంతేకాదు తాజ్ మహల్ లోపలి ప్రవేశించే ముందు శానిటైజ్ చేయబడతారు.

5. ఇక తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులు తప్పని సరిగా సామాజిక దూరాన్ని పాటించాలి. స్మారక చిహ్నం లోపల ఏ వస్తువునీ తాకడానికి పర్యాటకులకు అనుమతి లేదు. సందర్శకులు తమ సొంత వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లను కూడా తీసుకుని తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.

Also Read: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనాకు ముంబై హైకోర్టు లో చుక్కెదురు.. నెక్స్ట్ ఏంటి ?