Telugu News India News Covid19 Updates India reports 16,935 fresh cases and 51 fatalities in last 24 hours Telugu National News
India Corona: కరోనా నుంచి కాస్త ఊరట.. తగ్గిన కొత్త కేసులు.. మరణాలు మాత్రం భారీగానే
Covid19 Updates: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా 20 వేలకు పైనే నమోదవుతోన్న కొత్త కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ (Corona Bulletin) ప్రకారం.. నిన్న 2.61 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..
Covid19 Updates: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా 20 వేలకు పైనే నమోదవుతోన్న కొత్త కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ (Corona Bulletin) ప్రకారం.. నిన్న 2.61 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 16,935 మందికి పాజిటివ్‌గా తేలింది. అయితే టెస్టుల సంఖ్య తగ్గడం కూడా కేసులు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. కొత్త కేసులతో పాజిటివిటీ రేటు 6.48 శాతానికి పెరిగింది. దేశంలో మొత్తం క్రియాశీల కేసులు 1,44,264 కు చేరాయి. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 51 మంది మరణించారు. ఒక్క కేరళ నుంచే 29 మరణాలు సంభవించడం గమనార్హం. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,25,760 కి చేరింది.
కాగా నిన్న 16,069 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్లు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీల సంఖ్య 4,30,81,441 కు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. ఇక కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం చురుగ్గా కొనసాగుతోంది. గత ఏడాది ప్రారంభం నుంచి కేంద్రం తలపెట్టిన టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 200 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఇక జులై 15 నుంచి 18 ఏళ్లు పైడినవారందరికీ ఉచితంగానే ప్రికాషనరీ డోసును కూడా అందజేస్తున్నారు. నిన్న మొత్తం 4.46 లక్షల మంది కొవిడ్ టీకా తీసుకున్నారు.