Dog: స్మగ్లింగ్ లో పుష్పను మించిపోయింది.. అరెస్టు చేసిన పోలీసులకు చుక్కలు చూపించింది.. కట్ చేస్తే
ఓ శునకాన్ని (Dog) పోలీసులు 11 రోజులుగా రిమాండ్‌లో ఉంచారు. పోలీసులేంటి.. కుక్కను రిమాండ్‌లో ఉంచడమేంటి అనుకుంటున్నారా.. నిజమేనండి.. ఈ శునకం మామూలు శునకం కాదు.. స్మగ్లింగ్‌లో పుష్పను మించిపోయింది. మద్యం అక్రమ రవాణా...
ఓ శునకాన్ని (Dog) పోలీసులు 11 రోజులుగా రిమాండ్‌లో ఉంచారు. పోలీసులేంటి.. కుక్కను రిమాండ్‌లో ఉంచడమేంటి అనుకుంటున్నారా.. నిజమేనండి.. ఈ శునకం మామూలు శునకం కాదు.. స్మగ్లింగ్‌లో పుష్పను మించిపోయింది. మద్యం అక్రమ రవాణా కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. అందుకే ఎవరైతే మాకేంటి అంటూ పోలీసులు శునకాన్ని తీసుకెళ్లి లోపలేశారు. కొన్ని రోజులు బాగానే చూసుకున్నారు. అలా రోజులు గడుస్తుండగా కుక్కను పోషించలేమంటూ చేతులెత్తేశారు. యజమాని వచ్చి శునకాన్ని తీసుకెళ్లాలని కోరుతున్నారు. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లోని (Bihar) బక్సర్ జిల్లా ఘజీపూర్‌లో ఈ నెల 6న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో విదేశీ మద్యాన్ని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారితో పాటు ఆ కారులో జర్మన్ షెపర్డ్ శునకం కూడా ఉంది. ఇంకేముంది దానిని కూడా నిందితులతోపాటే స్టేషన్‌కు తరలించారు. నిందితులిద్దరినీ జైలుకు పంపిన పోలీసులు శునకాన్ని మాత్రం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.
ఇంతవరకూ ఓకే.. కానీ ఇప్పుడదే వారికి పెద్ద తలనొప్పిగా మారింది. దానికి రోజూ ఆహారం పెట్టలేక పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. దానికి రోజూ ఆహారం కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని బక్సర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. దాంతో ఇంగ్లీష్‌లోనే మాట్లాడాల్సి వస్తుందని, హిందీలో చెబితే వినడం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. అది తినే టైమింగ్స్ ఏంటో.. ఏం తింటుందో తెలియక తలనొప్పిగా మారిందని వాపోతున్నారు.
దానికి తిండిపెట్టేందుకు రోజూ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని, అందుకు స్టేషన్ సిబ్బంది అంతా కలిసి చందాలు వేసుకుంటున్నామన్నారు. ఫుడ్ విషయంలో అది ఏ మాత్రం రాజీపడడం లేదని, ఏమాత్రం తేడా వచ్చినా గట్టిగా మొరుగుతూ నానాయాగీ చేస్తోందని సిబ్బంది చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి