AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Vaccine: మహమ్మారితో పోరాడేందుకు మెరుగైన స్థితిలో ఉన్నాం.. ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్‌లు అందరు తీసుకోవాలిః ప్రధాని మోడీ

12 -14 ఏళ్ల మధ్య వయసున్న బాలబాలికలు, 60 ఏళ్లు పైబడిన పెద్దలు ముందు జాగ్రత్త మోతాదులో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం కోరారు.

Children Vaccine: మహమ్మారితో పోరాడేందుకు మెరుగైన స్థితిలో ఉన్నాం.. 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్‌లు అందరు తీసుకోవాలిః ప్రధాని మోడీ
Narendra Modi
Balaraju Goud
|

Updated on: Mar 16, 2022 | 4:27 PM

Share

Children Covid Vaccination: 12 14 ఏళ్ల మధ్య వయసున్న బాలబాలికలు, 60 ఏళ్లు పైబడిన పెద్దలు ముందు జాగ్రత్త మోతాదులో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) మంగళవారం కోరారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ(India) టీకా డ్రైవ్(Vaccine Drive) సైన్స్ ఆధారితమని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశంలో 180 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వడం జరిగిందన్నారు. తాజా 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కూడా టీకాలు వేయడం ప్రారంభమైంది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ను 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు అందజేస్తుండగా, మూడో డోస్‌ను 60 ఏళ్లు పైబడిన వారందరికీ వేయనున్నారు.

“మన పౌరులకు టీకాలు వేయడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. ఇప్పటి నుండి, 12 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు టీకాలకు అర్హులు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారందరూ ముందు జాగ్రత్త మోతాదులకు అర్హులు. ఈ వయస్సు వర్గాల ప్రజలు టీకాలు వేయవలసిందిగా నేను కోరుతున్నాను. ,” అని ట్వీట్ చేశారు. అర్హులైన వారందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను పూర్తి చేయాలని పిఎం మోడీ అన్నారు. తదుపరి వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రస్తావిస్తూ, భారతదేశ టీకా డ్రైవ్ ప్రపంచంలోనే అతిపెద్దదని అన్నారు. మన దేశ ప్రజలను రక్షించడానికి, అంటువ్యాధితో పోరాడటానికి మేము 2020 ప్రారంభంలో వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిని ప్రారంభించాము. 2021 జనవరిలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం టీకా ప్రచారాన్ని ప్రారంభించామని ప్రధాని మోడీ చెప్పారు. దీని ఉద్దేశ్యం వీలైనంత త్వరగా కరోనా నుండి ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడమే అని ప్రధాని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను భారీ విజయవంతానికి సహకరించిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు మరియు ప్రైవేట్ రంగాన్ని ఆయన అభినందించారు.

మార్చి 2021లో, 60 ఏళ్లు పైబడిన వారికి మరియు కొమొర్బిడిటీలు ఉన్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించబడింది. తరువాత, 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభించబడింది. ఇందులో 45 ఏళ్లు పైబడిన వారు మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. దీని తర్వాత, 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా అందించడం గర్వించదగ్గ విషయం. నేడు భారతదేశం 180 కోట్ల డోస్‌ల సంఖ్యను దాటింది. ఇందులో 15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల వారికి 9 కోట్ల డోసులు ఇవ్వగా, 2 కోట్లకు పైగా మూడవ డోసులు ఇవ్వడం జరిగింది. దీని వల్ల భారత మప్రజలు కరోనా నుండి గొప్ప రక్షణ పొందారని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

భారతదేశం వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశంసించారు ప్రధాని మోడీ. “అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా కొండ రాష్ట్రాలు మరియు పర్యాటకం ముఖ్యమైనవి, మొత్తం టీకా కవరేజీకి దగ్గరగా ఉన్నాయి మరియు అనేక పెద్ద రాష్ట్రాలు కూడా బాగా పనిచేశాయి” అని ఆయన చెప్పారు. కోవిడ్ 19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని భారత్ టీకా ప్రయత్నాలు మరింత పటిష్టం చేశాయని ప్రధాని అన్నారు. “మొత్తం ప్రపంచానికి సాయం అందించడంతో భాగంగా భారతదేశపు తత్వానికి అనుగుణంగా, వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద మేము అనేక దేశాలకు వ్యాక్సిన్‌లను పంపాము.” అని ప్రధాని తెలిపారు.

కోవిడ్‌కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలను కోరారు. “నేడు, భారతదేశంలో అనేక ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్‌లు ఉన్నాయి. నిర్ణీత మూల్యాంకన ప్రక్రియ తర్వాత మేము ఇతర వ్యాక్సిన్‌లకు కూడా అనుమతిని మంజూరు చేసాము. ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కోవడానికి మేము చాలా మెరుగైన స్థితిలో ఉన్నాము.” అని ప్రధాని తెలిపారు. అయితే దీనితో పాటు మనం కరోనాకు సంబంధించిన అన్ని నియమాలను పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు.

Read Also….

Kishan Reddy: ఈశాన్య భారత సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్.. మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి..