ఆయుష్మాన్ భారత్ పథకం కింద కోవిడ్ చికిత్స పొందాలంటే ఎవరెవరు అర్హులు ?పేద వర్గాలకే అన్నీ ఉచితం

కోవిడ్ చికిత్సకు కేంద్రం 'ఆయుష్మాన్ భారత్ యోజన' కింద గతంలోనే ఓ పథకాన్ని ప్రకటించింది. దీన్నే 'ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' గా కూడా వ్యవహరిస్తున్నారు.

  • Publish Date - 6:11 pm, Sat, 8 May 21 Edited By: Phani CH
ఆయుష్మాన్ భారత్ పథకం కింద కోవిడ్ చికిత్స పొందాలంటే ఎవరెవరు అర్హులు ?పేద వర్గాలకే అన్నీ ఉచితం
Ayushman Bharat Yojana

కోవిడ్ చికిత్సకు కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ కింద గతంలోనే ఓ పథకాన్ని ప్రకటించింది. దీన్నే ‘ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ గా కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇది పేదలకు అత్యంత వరప్రదాయిని అంటున్నారు. ఈ యోజన కింద దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలు, బడుగువర్గాలకు హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. దాదాపు 50 కోట్ల మంది… సాలుకు 5 లక్షల బీమా సౌకర్యం పొందగలుగుతారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇల్లు లేనివారికి, కుటుంబ పెద్దగా మహిళే అయి ఉన్న ఫ్యామిలీలకు, దివ్యాంగులకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, గిరిజనులకు రోజువారీ కూలీలు, ఏ ఆధారం లేనివారు ఈ పథకంకింద ప్రయోజనం పొందడానికి అర్హులవుతారని కేంద్రం పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో యాచకులు, చెత్తను ఏరుకునేవారు, పనిమనుషులు, మేస్త్రీలు, హాకర్లు, ప్లంబర్లు, వెల్డర్లు, కూలీలు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, డ్రైవర్లు, రిక్షా కార్మికులు కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ వర్గాలవారికి ప్రభుత్వ ఆసుపత్రులతో బాటు ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా ఉచితంగా కోవిడ్ టెస్టులు చేస్తారు. కాగా..సాధారణ జలుబు, జ్వరాన్ని ఈ పథకంలో చేర్చలేదు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఎలిజిబిలిటీ క్రైటీరియా ను చెక్ చేసుకోవాలనుకుంటే 14555 నెంబరును గానీ, 1800111565హెల్ప్ లైన్ నెంబరును గానీ సంప్రదించవచ్చునని కేంద్రం వివరించింది. ఆన్ లైన్ లో డబ్ల్యు డబ్ల్యు, డబ్ల్యు పీఎంజేడాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లో చూసుకోవచ్ఛు. కాగా కోవిడ్ సోకిన మూడు రోజులు ముందుగాను, హాస్పిటలైజేషన్ అనంతరం కూడా ఉచితంగా ట్రీట్ మెంట్, మందులు లభిస్తాయి. దేశంలో అర్హులైనవారంతా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది. అర్హులైన వారు తమ ఆధార్ కార్డు, కోవిద్ రిపోర్టు తదితరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే అనేక ఆస్పత్రులు ఇంకా సవాలక్ష నియమాలను పెడుతున్నాయి. పేదలు ఈ మూలకీ, ఆ మూలకీ తిరగాల్సి వస్తోంది. అన్నీ ఉచితమే అంటున్నారు గనుక అక్కడక్కడా వైద్య సిబ్బంది కూడా వీరిపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Income Tax: కోవిడ్‌ చికిత్సకు రూ. 2 లక్షల క్యాష్‌ చెల్లించేలా ఐటీ ఉత్తర్వులు.. ఎప్పటివరకంటే?

నెలకు 85 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి, ప్రజలందరికీ 3 నెలల్లో వ్యాక్సినేషన్ చేస్తాం , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్