Lockdown: మళ్లీ లాక్‌డౌన్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Lockdown: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాలో మళ్లీ తీవ్ర స్థాయిలో కేసులు నమోదు....

Lockdown: మళ్లీ లాక్‌డౌన్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
Maharashtra lockdown
Follow us
Subhash Goud

|

Updated on: Mar 11, 2021 | 1:49 PM

Lockdown: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాలో మళ్లీ తీవ్ర స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్రలో ముందంజలో ఉంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

కేవలం నిత్యావసర సరుకులను అమ్మే దుకాణాలు, మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. మిగతా రంగాలన్ని మూసి ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, నాగ్‌పూర్‌లో బుధవారం ఏకంగా 1710 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

నిత్యావసర సరుకులు అమ్మే షాపులు మినహా ఇతర దుకాణాలన్నీ సాయంత్రం 7 గంటల తర్వాత మూసివేయాలి. వారంలో ఆరు రోజులు మాత్రమే షాపులు తీయాలి. శని, లేదా ఆదివారం ఏదో ఒక రోజుతప్పనిసరిగా షాపులు మూసే ఉంచాలి. అలాగే రాత్రి 9 గంటల తర్వాత నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు కూడా తెరవకూడదు. హోటళ్లు, రెస్టారెంట్లకు మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

కాగా, అటు ముంబైలోనూ కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బీఎంసీ పరిధిలో 1500కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కరోనా కేసులతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు.

Corona Cases India: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే.!