ఆశ్రమంలో అమ్మాయిలపై అకృత్యాలు, బాబాగా చెప్పుకునే వీరేంద్ర దేవ్ దీక్షిత్ కోసం ఇంటర్ పోల్ నోటీసు
తనను బాబాగా, దైవాంశ సంభూతుడుగా చెప్పుకుంటూ తన ఆశ్రమంలో మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న79 ఏళ్ళ వీరేంద్ర దేవ్ దీక్షిత్ కోసం ఇంటర్ పోల్ నోటీసు జారీ అయింది.
తనను బాబాగా, దైవాంశ సంభూతుడుగా చెప్పుకుంటూ తన ఆశ్రమంలో మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న79 ఏళ్ళ వీరేంద్ర దేవ్ దీక్షిత్ కోసం ఇంటర్ పోల్ నోటీసు జారీ అయింది. ఇతగాడు నేపాల్ లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. 2017 లో ఈయన.. ఢిల్లీ లోని రోహిణి ప్రాంతంలో దుర్భేద్యమైన ఆశ్రమాన్ని నిర్మించుకుని..అనేకమంది మైనర్ బాలికలను, మహిళలను నిర్బంధించాడని, వారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడని ఆరోపణలున్నాయి. ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ అనే పేరిట నిర్మించుకున్న ఈ ఆశ్రమంలో ఈయన ఇలా మహిళలపట్ల అకృత్యాలకు దిగుతున్నాడంటూ అప్పట్లో పోలీసులకు కొన్ని ఫిర్యాదులు అందాయి. దీంతో వారు మూడు ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు చేశారు. తనపై వారు కేసు పెట్టారని తెలియాగానే వీరేంద్ర దేవ్ దీక్షిత్ పరారయ్యాడు. ప్రస్తుతం ఇతడు నేపాల్ లో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇతని అరెస్టుకు దారి తీసే సమాచారం ఇచ్చినవారికి 5 లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ నాడే ప్రకటించింది.2018 లో ఇతనికోసం ఈ సంస్థ లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసింది.
ఇతని ఆశ్రమంనుంచి సుమారు 40 మంది మహిళలు, బాలికలను ఢిల్లీ మహిళా కమిషన్ సాయంతో పోలీసులు గత డిసెంబరులో రక్షించారు. తమ మైనర్ బాలికలను వీరేంద్ర దేవ్ తన ఆశ్రమంలో నిర్బంధించాడని, వారిని హింసిస్తున్నాడని అనేకమంది తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఈ ఆశ్రమంపై ఒక్కసారిగా దాడి చేశారు. అక్కడ వెలుతురు లేని ఇరుకైన గదుల్లో మహిళలు, కొందరు బాలికలు దాదాపు బానిసల్లా దయనీయమైన స్థితిలో ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. బాధితులు బయటకు రాకుండామెటల్ బార్లు కూడా ఉన్నట్టు ఆ తరువాత ఖాకీలు తెలిపారు. ఢిల్లీ వంటి మహానగరంలో ఇలాంటి దొంగ బాబాలు ఇంకా ఎంతోమంది ఉండి ఉంటారని, పోలీసులు వారి పని కూడా పట్టాలని స్వచ్చంద సంస్టలు , ప్రజలు కోరుతున్నారు .
మరిన్ని చదవండి ఇక్కడ :