కరోనా ఎఫెక్ట్: నిబంధనలు పాటించకుండా పెళ్లి వేడుక.. హాజరైన 350 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. తగ్గినట్లే...
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. తగ్గినట్లే తగ్గి మళ్లీ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక మహారాష్ట్రలో మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించే దిశగా పయనిస్తోంది. నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇక ఆదివారం ముంబైలోని చెంబూర్‌లో ఒక వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సుమారు 350 మంది వరకు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మాస్కులు తప్పకుండా ధరించాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు. శుభకార్యాలు 50 మందితో మాత్రమే జరుపుకోవాలని ప్రభుత్వాలు ప్రకటించినా పెడచెవిన పెడుతున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపడుతున్నారు.
ముంబైలోని చెంబూరులో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన వారు కరోనా నిబంధనలు పాటించకపోవడంతో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పెళ్లి వేడుకకు ఎలాంటి కరోనా నిబంధనలు పాటించకుండా సుమారు 350 హాజరు కావడంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన అంధేరి వెస్ట్ వీర దేశాయ్ రోడ్‌లోని కొన్ని రెస్టారెంట్లు, పబ్బులపై అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు బీఎంసీ అధికారులు తెలిపారు.
Also Read: Corona Virus: ఆ జిల్లాలో మార్చి 7వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్.. ప్రకటించిన మంత్రి..