2-6 ఏళ్ళ మధ్య వయస్సుగల పిల్లలకు త్వరలో కోవాగ్జిన్ రెండో డోసు ..భారత్ బయో టెక్ వెల్లడి
2 నుంచి 6 ఏళ్ళ మధ్య వయస్సు గల పిల్లలపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ చురుకుగా సాగుతున్నాయని, వీరికి వచ్చే వారం రెండో డోసు ఇచ్చే అవకాశం ఉందని భారత్ బయో టెక్ సంస్థకు చెందిన వర్గాలు తెలిపాయి.
2 నుంచి 6 ఏళ్ళ మధ్య వయస్సు గల పిల్లలపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ చురుకుగా సాగుతున్నాయని, వీరికి వచ్చే వారం రెండో డోసు ఇచ్చే అవకాశం ఉందని భారత్ బయో టెక్ సంస్థకు చెందిన వర్గాలు తెలిపాయి. వీరి వయస్సుల ప్రకారం వీరిని వేర్వేరు గ్రూపులుగా వర్గీకరించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 175 మంది పిల్లలను ఆయా గ్రూపుల ప్రకారం వర్గీకరించామని, ట్రయల్స్ సురక్షితమైన రీతిలో సాగుతున్నాయని ఇవి వెల్లడించాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఇప్పటికే 6 నుంచి 12 ఏళ్ళ వారికి ఈ టీకామందు ఇచ్చారు. దేశంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో అత్యంత జాగరూకతతో పిల్లలకు మొదటి డోసు ఇచ్చి పరీక్షించి చూస్తున్నారు. రెండో డోసు ఇచ్చిన అనంతరం ఓ తాత్కాలిక నివేదికను ఆగస్టు మాసాంతానికి భారత్ బయోటెక్ సమర్పించనుంది. కొవ్యాగ్జిన్ వ్యాక్సిన్ ఎంత సురక్షితమైనదో ఈ రిపోర్టులో వివరించనున్నట్టు తెలుస్తోంది.
18 ఏళ్ళ లోపు వయస్కులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావస్తున్నాయని ఇటీవల కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తదనంతర చర్యలను త్వరలో తమకు స్పష్టం చేయాలని కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత్ బయో టెక్ వారి కోవాగ్జిన్ టీకా మందే కాకుండా జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ని కూడా పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు వినియోగిస్తున్నారు. ఏమైనా.. దేశంలో కొన్ని జిల్లాల్లో పిల్లలు కోవిడ్ పాజిటివ్ బారిన పడడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఏపీ విశాఖలో ఆరు నెలల చిన్నారి కూడా ఈ వైరస్ కి గురి కావడంతో పీడియాట్రిక్ నిపుణులు, డాక్టర్లు ఆ చిన్నారికి ప్రత్యేక చికిత్స నిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఇదేం సాహసం రా బాబు.. ఎత్తైన వంతెన నుంచి ఎలా దూకేశాడో..!వైరల్ అవుతున్న వీడియో.:Man Jumping Video.
బైక్ రైడర్స్ కు శుభవార్త..కేటీఎమ్ 250 బైక్‌పై బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్..!:KTM 250 bike Video
Monkey Viral Video: బాబోయ్ కోతి..! నడిరోడ్డుపై కత్తి నూరుతోంది..!నవ్వులు పూయిస్తున్న వీడియో.