ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు ప్రారంభమైన ‘కౌంట్ డౌన్’….జ్యోతిరాదిత్య సింధియా, వరుణ్ గాంధీలకు ఛాన్స్ …?
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు 'కౌంట్ డౌన్' ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మోదీ నాలుగు రోజుల్లో రెండుసార్లు వేర్వేరుగా బీజేపీ ఎంపీలతో సమావేశం కావడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు .
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు ‘కౌంట్ డౌన్’ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మోదీ నాలుగు రోజుల్లో రెండుసార్లు వేర్వేరుగా బీజేపీ ఎంపీలతో సమావేశం కావడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు . అంతకు ముందు గత శని, ఆదివారాల్లో హోమ్ మంత్రి అమిత్ షా కూడా సుమారు 30 మంది ఎంపీలతో సమావేశమై.. వారి వారి నియోజకవర్గాల్లో ముఖ్యంగా కోవిద్ అదుపునకు వారెలాంటి కృషి చేశారో తెలుసుకుని వారి పనితీరును మదింపు చేశారు. లోక్ జనశక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ మృతి నేపథ్యంలో ఖాళీ అయిన పోస్టును భర్తీ చేయాల్సి ఉంది. అలాగే శిరోమణి అకాలీదళ్. శివసేన ఎన్డీయే నుంచి వైదొలగిన నేపథ్యంలో కూడా ఖాళీ అయిన స్థానాలను కేంద్రం భర్తీ చేయవలసి ఉందని అంటున్నారు. పైగా వివిధ శాఖల మంత్రులు ఒకటి కన్నా ఎక్కువ శాఖ్లను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఉదాహరణకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్… వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖలను, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గ్రామీణాభివృద్ధి శాఖను కూడా చూస్తున్నారు. కేబినెట్ లో కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చే యోచన ఉన్నట్టు చెబుతున్నారు.
అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ నిన్న ఢిల్లీ చేరుకుని పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా, వరుణ్ గాంధీ, దినేష్ త్రివేదీ, దిలీప్ ఘోష్, అశ్విని బైష్ణబ్, లడఖ్ ఎంపీ జమయాంగ్ సెరింగ్ నంగ్యా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద పేరు సైతం వినవస్తోంది. ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో 24 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది ఇండిపెండెంట్ ఇన్-ఛార్జి మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు ఉన్నారు.రెండేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం లోకి వచ్చిన రాష్ట్రాలకు కూడా ప్రాముఖ్యతనిచ్చి.. ముఖ్యులను సంతృప్తి పరచవచ్చునని సమాచారం.
మరిన్ని ఇక్కడ చూడండి: Rangareddy child death Video: వాటర్ ట్యాంక్‌లో శవమై తేలిన రెండేళ్ల పసిబాలుడు.మనసును కదిలించే వీడియో .