కోరోనిల్ టాబ్లెట్‌.. రాందేవ్‌ బాబాపై కేసు నమోదు‌..

కరోనా మహమ్మారికి ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చంటూ మంగళవారం నాడు పతంజలి సంస్థ మందు తయారు చేశామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము తయారు చేసిన కోరోనిల్...

కోరోనిల్ టాబ్లెట్‌.. రాందేవ్‌ బాబాపై కేసు నమోదు‌..
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2020 | 4:03 PM

కరోనా మహమ్మారికి ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చంటూ మంగళవారం నాడు పతంజలి సంస్థ మందు తయారు చేశామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము తయారు చేసిన కోరోనిల్ కిట్‌తో మూడు నుంచి ఏడు రోజుల్లో కరోనా మహమ్మారిని తరిమేయవచ్చంటూ ప్రకటించింది. అయితే పతంజలి సంస్థ ప్రజల్ని మోసం చేస్తుందంటూ పలువురు కేసులు నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన పలువురు వ్యక్తులు రాందేవ్ బాబాపై, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పతంజలి సీఈవోతో పాటు.. యోగా గురువు రాందేవ్ బాబాపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. వీరిద్దరితో పాటు మరో ముగ్గురి మీద కూడా కేసులు నమోదు చేశారు. కోరోనిల్ టాబ్లెట్‌తో కరోనా మహమ్మారికి చెక్ పెట్టవచ్చంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జ్యోతినగర్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. కోరోనిల్‌ పేరుతో పతంజలి ప్రజల్ని తప్పుదోవ పట్టించిందని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశామని తెలిపారు. యోగా గురువు రాందేవ్‌ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, శాస్త్రవేత్త అనురాగ్‌, నిమ్స్‌ చైర్మన్‌ బల్బీర్‌ సింగ్‌ తోమర్‌, నిమ్స్‌ డైరక్టర్‌ అనురాగ్‌పై చీటింగ్‌ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

కాగా, కోరోనిల్ ఔషధంపై కేంద్ర ఆయుస్ మంత్రిత్వ శాఖ బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. దీని శాస్త్రీయత గురించి నిర్ధారించాలని.. అప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశాలు జారీచేసింది.