కరోనాపై పోరు.. వ్యాక్సీన్ల తయారీలో ఇండియాదే జోరు

కరోనా రాకాసిని అణచివేసేందుకు సుమారు 150 దేశాలకు వివిధ వ్యాక్సీన్లను పంపుతున్న ఇండియా నిజంగా గ్లోబల్ వ్యాక్సీన్ హబ్ గా  పాపులర్ అవుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే 14 మేజర్ ప్రాజెక్టులు ఈ తయారీకి ఆలంబనగా నిలుస్తున్నాయి.

కరోనాపై పోరు.. వ్యాక్సీన్ల తయారీలో ఇండియాదే జోరు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2020 | 4:20 PM

కరోనా రాకాసిని అణచివేసేందుకు సుమారు 150 దేశాలకు వివిధ వ్యాక్సీన్లను పంపుతున్న ఇండియా నిజంగా గ్లోబల్ వ్యాక్సీన్ హబ్ గా  పాపులర్ అవుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే 14 మేజర్ ప్రాజెక్టులు ఈ తయారీకి ఆలంబనగా నిలుస్తున్నాయి. ప్రైవేటు, అకడమిక్ సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఎనిమిది వేర్వేరు రాష్ట్రాల్లో ఎనిమిది నగరాల్లోని ఈ ప్రాజెక్టులనే తీసుకుంటే వేటికవే తమ కృషిలో ఘనతను చాటుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి ట్రయల్ దశలోకి ఎంటర్ కాగా.. ,మరో  నాలుగు అడ్వాన్స్ దశల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని బయో టెక్నాలజీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ధృవీకరించాయి.

పూణే లోని సీరమ్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఇండియా, జెన్నోవా, ఎంజీన్ బయో సైన్సెస్, సీగుల్ బయో సొల్యూషన్స్, హైదరాబాద్ లోని భారత్ బయో టెక్, ఐఐ సీటీ హైదరాబాద్, అరబిందో ఫార్మా, మొహాలీ (పంజాబ్) లోని ఐఐఎస్ ఈ ఆర్ మొహాలీ, అహమ్మదాబాద్ లోని  కేడిలా హెల్త్ కేర్, త్రివేండ్రం లోని ఐఐఎస్ ఈ ఆర్ త్రివేండ్రం, వెల్లూరు (తమిళనాడు) లోని సీఎంసీ వెల్లూరు, ఢిల్లీ లోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఈ వైరస్ నిరోధక వ్యాక్సీన్ తయారీలో అహర్నిశలూ కృషి చేస్తున్నాయి. సుమారు 30 వ్యాక్సీన్ తయారీ కార్యక్రమాలు పురోగతిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇండియాను ‘వ్యాక్సీన్ హబ్’ గా గుర్తించడం ఈ సందర్భంగా గమనార్హం.

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!