Corona Cases India: దేశ ప్రజలకు ఊరట.. తగ్గిన పాజిటివ్ కేసులు.. భారీగా పెరిగిన రికవరీలు..!
Corona Cases India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే పాజిటివ్ కేసులు తగ్గుతుండటం.. రికవరీలు..

Corona Cases India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే పాజిటివ్ కేసులు తగ్గుతుండటం.. రికవరీలు పెరుగుతుండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,22,315 కేసులు నమోదయ్యాయి. అలాగే మహమ్మారి కారణంగా 4,454 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,67,52,447 కరోనా కేసులు నమోదు కాగా.. 3,03,720 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.
కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 3,02,544 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 2,37,28,011కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27,20,716 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 88.69శాతం ఉండగా.. మరణాల రేటు 1.14శాతం ఉంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 19,28,127 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 33,05,36,064 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 19,60,51,962 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.




