Coronavirus: దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మరి మీ వ్యాక్సిన్ పని చేస్తుందా? తెలుసుకోండిలా..

వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, దానితో పోరాడటానికి కొన్ని ప్రోటీన్లు కావాల్సి ఉంటుంది. అవి వైరస్ లాగా శరీరంలో ఉంటాయి. ఇటువంటి ప్రోటీన్లను యాంటీబాడీస్..

Coronavirus: దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మరి మీ వ్యాక్సిన్ పని చేస్తుందా? తెలుసుకోండిలా..
Coronavirus
Follow us

|

Updated on: Apr 24, 2022 | 7:23 PM

దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీ తర్వాత హర్యానా, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా గత రెండు రోజుల్లో కేసులు భారీగా పెరిగాయి. ఐఐటీ మద్రాస్‌లో ఇప్పటివరకు 55 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రజల మదిలో అనేక రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోస్ అవసరమా అనేది అందులో ఒక ప్రశ్న. కొంతమంది మూడో డోస్ కూడా తీసుకున్నారు. కాబట్టి వారి టీకా పని చేస్తుందా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వంటి ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన టీకా ఎంత వరకు సురక్షితమో ఇప్పుడు తెలుసుకుందాం. బీహెచ్‌యూ జీవశాస్త్రవేత్తలు సెరో సర్వేను నిర్వహించారు. దీనిలో 116 మంది వ్యక్తుల నమూనాను తీసుకుని పలు పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలో ఏంటో ఓసారి చూద్దాం..

సర్వేలో వెల్లడైన ఆశ్చర్యకరమైన విషయాలు..

116 మందిలో 17 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు కనుగొన్నారు. మిగతా వారిలో యాంటీబాడీలు లేకపోవడం గమనార్హం. 70 శాతం కంటే ఎక్కువ మంది వ్యక్తులలో యాంటీబాడీలు తొలగిపోతే, అప్పుడు కరోనా కేసులు పెరుగుతాయని బీహెచ్‌యూ శాస్త్రవేత్తులు తెలిపారు. దేశంలో ముందుజాగ్రత్త మోతాదులు కూడా వేస్తున్నారు. అలాంటప్పుడు యాంటీబాడీలు ఎందుకు తయారు కావడం లేదనే విషయాన్ని కూడా వారు వెల్లడించారు. ఇందుకు 15 శాతం మంది మాత్రమే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

యాంటీబాడీ అంటే ఏమిటి?

వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, దానితో పోరాడటానికి కొన్ని ప్రోటీన్లు కావాల్సి ఉంటుంది. అవి వైరస్ లాగా శరీరంలో ఉంటాయి. ఇటువంటి ప్రోటీన్లను యాంటీబాడీస్ అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.. IGM – ఇది ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రారంభ ప్రక్రియలో పనిచేస్తుంది. ఇది వైరస్ సంక్రమణ మొదటి దశలో అభివృద్ధి చెందుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, IGM ఒక వ్యక్తి రోగనిరోధక దశలోకి ప్రవేశించినట్లు మాత్రమే చెబుతుంది. IGG – ఇందులో , యాంటీబాడీస్‌తో ఇన్ఫెక్షన్ ఆలస్యంగా గుర్తించేలా చేస్తుంది. Igg యాంటీబాడీ చాలా కాలం పాటు శరీరంలో ఉంటుంది. అయితే, యంటీబాడీస్ మన శరీరంలో ఉన్నాయో లేదో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం యాంటీబాడీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో ఎలా తెలుసుకోవడం? అలాగే యాంటీబాడీ పరీక్ష చేస్తే ఏం తెలుస్తుంది?

రెండు టీకాలు వేసుకున్న తర్వాత, యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష తర్వాత శరీరంలో యాంటీబాడీస్ తక్కువగా ఉంటే, మీ శరీరంలో వ్యాక్సిన్ ప్రభావం తగ్గిందని అర్థం చేసుకోవాలి. కానీ, మీ శరీరంలో ఎక్కువ యాంటీబాడీలు ఉంటే, వ్యాక్సిన్ ఇంకా పనిచేస్తోందని అర్థం.

యాంటీబాడీ పరీక్ష చేయించుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

యాంటీబాడీ పరీక్షను పూర్తి చేయడానికి దాదాపు రూ. 500 నుంచి రూ.1000 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డిప్కోవాన్ కిట్‌ను యాంటీబాడీ పరీక్ష కోసం అభివృద్ధి చేసింది. దీని ధర కేవలం రూ.75 మాత్రమే.

రిపోర్టు రావడానికి ఎంత సమయం పడుతుంది?

యాంటీబాడీ టెస్ట్ చేసిన తర్వాత, రిపోర్టు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం 1-2 గంటల్లో నివేదికను అందుకుంటారు.

టీకా ద్వారా మాత్రమే యాంటీబాడీస్ తయారవుతాయా ?

టీకా వేసుకున్న తర్వాత మొదటిసారిగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను తయారు చేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను ఎలా తయారు చేస్తుంది?

శరీరం వ్యాధికి కారణమయ్యే బాహ్య వ్యాధికారక క్రిములు ఎంటర్ అయినప్పుడు, బాడీలోని రోగనిరోధక వ్యవస్థ ఈ వ్యాధికారక క్రిములతో పోరాడటానికి రక్షిత ప్రోటీన్‌లను తయారు చేస్తుంది. వీటినే యాంటీబాడీస్ అంటారు. యాంటీబాడీ వైరస్‌ను గుర్తించి చంపడానికి సహాయపడుతుంది. కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా మన శరీరం ప్రతిరోధకాలను తయారు చేస్తుంది.

టీకా సైకిల్ ఎంతకాలం ఉంటుంది?

కరోనా వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై నిపుణులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీని నివారణ పూర్తిగా పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని వైద్యులు అంచనా వేస్తున్నారు.

Also Read: India Covid-19: కరోనా ఫోర్త్ వేవ్ అలర్ట్.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు..

Coronavirus: మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. ఆ క్యాంపస్‌లో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.