T.Congress: కలహాల కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు.. రేవంత్‌కు వ్యతిరేకంగా మరోవర్గం కొత్త రాగం..
తెలంగాణ కాంగ్రెస్ నేతల లొల్లి మళ్లీ మొదటికి వొచ్చిందా?. కలహాల కాంగ్రెస్ లో కొత్త చిచ్చు రాజుకుందా?. రాహుల్ సభ కసరత్తు.. టీకాంగ్రెస్ లో కత్తులు దూస్తుందా?. క్రెడిట్ కోసం పార్టీనేతల కొట్లాటకు దారి తీసిందా?
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేతల లొల్లి మళ్లీ మొదటికి వొచ్చిందా? కలహాల కాంగ్రెస్ లో కొత్త చిచ్చు రాజుకుందా? రాహుల్ సభ కసరత్తు.. టీకాంగ్రెస్ లో కత్తులు దూస్తుందా? క్రెడిట్ కోసం పార్టీనేతల కొట్లాటకు దారి తీసిందా? ఎవరికివారే యమునా తీరే అన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ నేతల లొల్లి. కలహాల కాంగ్రెస్ లో కొత్తు చిచ్చు రాజుకున్నట్లైంది. వరంగల్ లో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేసి క్రెడిట్ సంపాదించేందుకు టీకాంగ్రెస్ నేతలు ఎవరి పాట్లు వారు పడుతున్నట్లే ఉంది ప్రజెంట్ సిచ్యూవేషన్. రాహుల్ గాంధీ వద్ద మార్కులు కొట్టేసేందుకు ఎవరివారే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు జిల్లాల్లో ఇటు గాంధీ భవన్ లో వరుస భేటీలకు ప్లాన్ చేసుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మరోవైపు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లాంటి నేతలు ప్రత్యేకంగా సమావేశమై.. రాహుల్ సభ విజయవంతం చేయాలని కొత్త రాగం అందుకోవడం ఇప్పుడు టీకాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే రాహుల్ సభ విజయవంతం కోసం నేతలంతా కృషి చేయాలని అన్ని జిల్లాల నేతలతో తానే స్వయంగా మాట్లాడతానని డీసీసీ లకు చెప్పారు రేవంత్. అందుకు సన్నద్ధంగా రేపటి నుంచి జిల్లాల పర్యటనకు ప్లాన్ చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇంతలోనే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మధుయాష్కీ, మహేశ్వర్ రెడ్డి లాంటి నేతలు భేటీ కావడం.. ఈ సమావేశానికి పీసీసీని పిలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా సమావేశం అనంతరం నేతలంతా గాంధీ భవన్ లో కాకుండా సీఏల్పీ లో ప్రెస్ మీట్ పెట్టి సభ విజయవంతం చేయాలని కోరడం కొత్త చిచ్చును రాజేస్తుంది. సభ సక్సెస్ పై అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి కానీ ఏ ఒక్కరి వల్లో విజయవంతం కాదని కోమటిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయడం రేవంత్ కి కౌంటర్ అనే టాక్ పార్టీలో చర్చ జరుగుతుంది.
సోమవారం జిల్లాల పర్యటనకు వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి మరో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ తమ జిల్లా కు అవసరం లేదని.. నల్లగొండలో ఉత్తమ్, తాను చూసుకుంటానని కోమటిరెడ్డి అనడం కాంగ్రెస్ లో కొత్త లొల్లిని క్రియేట్ చేస్తుంది. ఇదే కాక పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభ పేరును మార్చాలని ఉత్తమ్ సూచించారు. అయితే రైతు సంఘర్షణ సభ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిందని.. పేరు మార్చడం కుదరదని రేవంత్ చెప్పినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మధన్ మోహన్ ను రెండు రోజుల క్రితం పార్టీ నుండి సస్పెండ్ చేసారు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు. అయితే దీని వెనుక షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి ఉన్నారనేది..కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ. ఈ విషయంపై కూడా ఉత్తమ్ ఇంట్లో చర్చించారని.. ఆ తర్వాతే మహేష్ కుమార్ గౌడ్ ..కామారెడ్డి డీసీసీ వివరణ కోరినట్లు సమాచారం.
మొత్తానికి రాహుల్ గాంధీ తో భేటీ తర్వాత నేతలంతా కలిసిపోతారనుకుంటే.. అదే రాహుల్ సభ మళ్ళీ ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసినటైంది. ఈ పరిణామాలన్ని ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో మొదలైంది.
ఇవి కూడా చదవండి: Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..
Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..