Khelo India University Games 2021: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. లైవ్ వీడియో

Khelo India University Games 2021: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Apr 24, 2022 | 4:21 PM

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆదివారం నుంచి ప్రారంభం. కరోనా కారణంగా, గత సంవత్సరం ఈ ప్రత్యేక ఆటలను నిర్వహించలేదు. ఈ సారి కరోనా అదుపులోనే ఉండటంతో ఈ ప్రత్యేక టోర్నమెంట్‌ను పూర్తి సన్నాహాలతో నిర్వహిస్తున్నారు.



బెంగళూర్‌ కంఠీరవ స్టేడియంలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ గేమ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అనుగార్‌ ఠాకూర్‌ నిశిత్‌ ప్రామాణిక్‌ తదితరులు హాజరయ్యారు . గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ , కర్నాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై కూడా పాల్గొన్నారు

దేశం నలుమూలల నుంచి 3,879 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్‌ సాధించిన క్రీడాకారులు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌కు విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. 200 యూనివర్సిటీలకు చెందిన క్రీడాకారులు ఈవెంట్‌లో పాల్గొంటెన్నారు.20 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. మల్లకాంబ , యోగాసన లాంటి స్వదేశీ క్రీడలను కూడా ఈసారి పోటీల్లో ప్రోత్సహిస్తున్నారు. వివిధ విభాగాల్లో 375 గోల్డ్‌మెడల్స్‌ కోసం క్రీడాకారులు పోటీ పడుతున్నారు.

మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Also Watch:

ఆ అంశంపై ప్రత్యేక కోర్సు.. విద్యార్థులతో పాటు లెక్చరర్లూ వీడియోలు చూసేలా.. ఇంతకీ ఎక్కడంటే

Published on: Apr 24, 2022 04:01 PM